విష సర్పాల మంద.. వెన్నులో వణుకు!

60 Venomous Snakes Found In Schools Kitchen - Sakshi

ముంబై : ఓ స్కూల్‌ వంట గదిలో విష సర్పాల గుంపు బయటపడటం కలకలం సృష్టించింది. వాటిని చూసిన విద్యార్థులు, వంట మనుషులకు వెన్నులో వణుకు పుట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర, హింగోలి జిల్లా, భొకారే గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో చోటుచేసుకుంది. ప్రతి రోజులాగే  వంట మనిషి గదిలోకి వెళ్లి వంట కోసం కట్టెలు తీయ సాగింది. ఒకటి రెండు కట్టెలు తీసిన తర్వాత ఆమెకు భయంకరమైన పాముల గుంపు కనిపించింది. వెంటనే భయంతో అరుస్తూ బయటకు పరుగెత్తుకొచ్చింది. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలపగా అతను పాములు పట్టేవారికి సమాచారం అందించారు. స్నేక్‌ క్యాచర్‌ విక్కీ దాలడ్‌ వచ్చి రెండు గంటల పాటు కష్టపడి సుమారు 60 పాములు పట్టుకున్నాడు. దీంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాములను ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించినట్లు విక్కీ దాలడ్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top