డబుల్‌ సైడ్‌ మల్టీమేకర్‌! నూనె లేకుండా.. | Double Sided Heating Baking Machine Gives Kitchen Luxury Look | Sakshi
Sakshi News home page

డబుల్‌ సైడ్‌ మల్టీమేకర్‌! నూనె లేకుండా..

Oct 9 2023 10:59 AM | Updated on Oct 9 2023 10:59 AM

Double Sided Heating Baking Machine Gives Kitchen Luxury Look - Sakshi

శ్రమ లేకుండా సౌకర్యాలను అందించడంతో పాటు.. కిచెన్‌కి లగ్జరీ లుక్‌నీ ఇచ్చే ఈ డబుల్‌ సైడ్‌ హీటింగ్‌ బేకింగ్‌ మెషిన్‌.. యూజర్‌ ఫ్రెండ్లీగా డిమాండ్‌లో ఉంది. ఇందులో ఇండిపెండెంట్‌ టెంపరేచర్‌ కంట్రోల్, డబుల్‌ పాల్‌  గ్రిల్లింగ్, త్రీ టైప్స్‌ ఆఫ్‌ బేకింగ్‌ వంటి ఆప్షన్స్‌ ఉన్నాయి. మూడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్‌ మేకర్‌.. రకరకాల రుచులను నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. ఈ మేకర్‌లో గ్రిల్‌ లేదా ఫ్రై చేసుకోవాలంటే నూనె చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది.

క్లీన్‌ చేసుకోవడమూ సులభమే. ఇది రోజువారీ వంటకాలకే కాకుండా పార్టీలు, ఫంక్షన్స్‌లో వెరైటీ వంటకాలు చేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో కూరలు, సూప్స్‌ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. పాన్‌  కేక్స్, కట్లెట్స్‌ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. దీనితో షార్ట్‌ సర్క్యూట్‌ సమస్య రాదు. దీనికి అటాచ్డ్‌ మూతతో పాటు ఒక ట్రాన్స్‌పరెంట్‌ మూత విడిగా లభిస్తుంది.  

(చదవండి: ఈ కొత్త ర‌కం కుక్క‌ర్ లో వంట‌లు చాలా సుల‌భం)

Advertisement
 
Advertisement
Advertisement