
పండుగలు, పబ్బాలు అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలంకరించుకోవడం మొదలు పూజలు, పిండివంటలు అబ్బో ప్రతీ ఇంట్లోనూ ఈ హడావిడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి కుబేరుల దాకా ఈ సందడి ఉంటుంది. ఇక వెలుగుల పండుగ దీపావళి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. దీపావళి వేడుకలు, భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటగా రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు? అసలు అక్కడ ఫుడ్ మెనూ ఎవరు ప్రిపేర్ చేస్తారు. వంటింట్లో ఎవరి ప్రాముఖ్యత ఎంత?
ముంబైలోని అతి విలాసవంతమైన భవనం, ముఖేష్ అంబానీ ఉండే భవనం ‘యాంటిలియా’లో వందలాది మంది సిబ్బంది పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి ఇంట్లో వంటింటి పెత్తనం ఎవరిది అనేది ఇపుడు చర్చ. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ముఖేష్, నీతా దంపతులకు ముగ్గురు సంతానం, ఆకాష్,అనంత్, ఇషా. కూతురు పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లింది. ఇక ఇద్దరు కొడుకులు, కోడళ్లతో నివసించే ఉమ్మడి కుటుంబం. అలాగే రిలయన్స్ ఫౌండర్ దివంగత ధీరూభాయ్ అంబానీ సతీమణి, ముఖేష్ తల్లి కూడా వీరితోపాటే ఉంటారు.
చదవండి: Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!
Radhika Merchant Vs Sloka Mehta ఈ ఉమ్మడి కుటుంబంలో కిచెన్ బాధ్యత ఎవరిదన్న కుతూహలం అందరిలో ఉంటుంది. పెద్ద కోడలు శ్లోక మెహతా, చిన్నకోడలు రాధికా మర్చంట్ మధ్య చాలా సఖ్యత ఉంటుందట. అంబానీ కుటుంబం శాఖాహారులు. తాజా వార్తల ప్రకారం పెద్ద కోడలు శ్లోక మెహతా రోజువారీ మెనూను నిర్ణయిస్తారు. శ్లోకకు కుటుంబ సంప్రదాయాలు ఆహార ప్రాధాన్యతలు బాగా తెలుసు. ఆమె వంట గదిని పర్యవేక్షిస్తుంది. కుటుంబం, అతిథులు, పండుగలు, విందు భోజనాలను ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.
రాధిక మర్చంట్ ఇటీవల అంబానీ కుటుంబంలో చేరిన నేపథ్యంలో ఇంటి పద్ధతులను ఆచారాలను ఇపుడిపుడే అవగాహన చేసుకుంటోంది. సంప్రదాయాలను నేర్చుకుంటోంది. కుటుంబ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ ముద్దుల కోడలు అనిపించుకుంటోంది.
(బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు )
కాగా అంబానీలు ఆరోగ్యకరమైన, సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడే స్వచ్ఛమైన శాఖాహారి. క్షణాల్లో వంటకాలను తయారు చేసి, వేడిగా వడ్డించేందుకు చెఫ్‌లు రెడీగా అందుబాటులో ఉంటారు. దీనికితోడు అప్పుడప్పుడు హోటళ్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారాల్లో ముంబైలోని 'మైసూర్ కేఫ్' నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటారనే విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్