‘అబ్బో... ఈరోజు కూడా వంట చేయాలా!’ అని బద్దకిస్తారు కొద్దిమంది. అలాంటి వారిని కూడా ‘ఆహా...ఈరోజు కూడా వంట చేస్తాను’ అని ఉత్సాహంగా వంటగది (Kitchen) వైపు అడుగులు వేయించడమే.. మైండ్‌ఫుల్ కిచెన్ మూమెంట్. కిచెన్ అనేది ఇప్పుడు కేవలం కిచెన్ మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లకు సంబంధించి సృజనాత్మక ఆలోచనల కేంద్రంగా, ప్రయోగశాలగా మారడమే.. మైండ్‌ఫుల్ కిచెన్ మూమెంట్ (Mindful Kitchen Movement).
‘నిజమైన ఆరోగ్యం అనేది అవగాహనతోనే మొదలవుతుంది. మనం ఏమి తింటామో అనే దానిలోనే కాదు, మనం ఎలా వండుతాము అనేదానితోనూ ఆరోగ్యం (health) ప్రారంభం అవుతుంది. సృష్టించడం, పోషించడం, పునరుద్ధరించడానికి సంబంధించి వంటగదికి నిశ్శబ్ద శక్తి ఉంది. తినడం కోసం కాదు రిలాక్స్ కోసం వంట చేస్తున్నామని 65 శాతం కంటే ఎక్కువ మంది మంది వినియోగదారులు చెబుతున్నారు’ అంటున్నారు కుక్‌వేర్ బ్రాండ్ కుమిన్ కో కో ఫౌండర్స్ నిహారిక జోషి, ఉదిత్ లేఖీ.
చదవండి: బుజ్జి కుక్కపిల్లను భలే కాపాడారు!


