మరో రెండు ఆలయాలకు ముకేశ్‌ అంబానీ భారీ విరాళం | Mukesh Ambani visits Nathdwara Guruvayur donates crores for temples | Sakshi
Sakshi News home page

మరో రెండు ఆలయాలకు ముకేశ్‌ అంబానీ భారీ విరాళం

Nov 10 2025 4:28 PM | Updated on Nov 10 2025 5:27 PM

Mukesh Ambani visits Nathdwara Guruvayur donates crores for temples

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ఇండస్ట్రీస్అధినేత ముకేశ్అంబానీ మరో రెండు ఆలయాలకు భారీ విరాళాలు ప్రకటించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన ముకేశ్అంబానీ అక్కడ అత్యాధిక వంటశాల నిర్మించనున్నట్లు ప్రకటించారు.

తర్వాత ఆయన రాజస్థాన్లోని నాథ్ద్వారాశ్రీనాథ్జీ మందిరం, కేరళలోని గురువాయూర్ఆలయాలను సందర్శించారు. నాథ్‌ద్వారా ‍శ్రీనాథ్‌జీ మందిరంలో నాథ్ద్వారాలో అంబానీ భగవాన్ శ్రీనాథ్ జీ భోగ్ హారతి దర్శనానికి హాజరై గురు శ్రీ విశాల్ బావా సాహెబ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అక్కడ యాత్రికులకు, సీనియర్ సిటిజన్‌ల సేవా సముదాయం నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆలయానికి రూ.15 కోట్లు విరాళం ఇచ్చారు.

ఇక కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అంబానీ నెయ్యి దీపాలు వెలిగించి, ఆలయ ధ్వజ స్తంభం వద్ద నైవేద్యాలు సమర్పించారు. దేవస్వం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మొదటి విడతగా గురువాయూర్ దేవస్వంకు రూ .15 కోట్ల చెక్కును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement