
దివ్యమైన దీపావళి పండగ సంబరాలను సమయం మరెంతో దూరంలో లేదు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. ధంతేరస్, నరక చతుర్ధశి (ఛోటీ దీపావళి), దీపావళి, యమ విదియతో దీపావళి పండుగ ముగుస్తుంది.
దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని, గణపతి, కుబేరడిని విశేషంగా పూజించడం ఆనవాయితీ. దీనికి అనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సత్యభామ సాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించడం, 14 సంవత్సరాల వనవాసం నుండి రాముడు తిరిగి వచ్చిన వేళ దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారని కూడా చెబుతారు.
కొత్త బట్టలు, లక్ష్మీ, గణపతి: అయితే దీపావళి రోజు లక్ష్మీదేవితోపాటు,గణపతి ప్రతిమలను తెచ్చుకొని కొలిస్తే సిరిసంపదలకు లోటు ఉండదని నమ్మకం. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. కొత్త బట్టలు, దీప కాంతులతో పాటు దీపావళి పండుగ రోజు కొన్ని వస్తువులను తీసుకొని రావడం శుభప్రదంగా పరిగణిస్తారు. తద్వారా సంపద కలిగి శ్రేయస్సు లభిస్తుందని భావిస్తారు.ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను కొనుగోలు చేయడం శుభప్రదమని, అంతా మంచే జరుగుతుందట.
చదవండి: Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!
తాబేలు: విష్ణుమూర్తికి ప్రతిరూపమైన తాబేలు ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఆర్థికాభివృద్ధితోపాటు ఇంటిల్లిపాదికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతారు.శ్రేయస్సుకు, సంపదకు సంకేతమైన కొబ్బరికాయను తెచ్చుకుంటారు. దీంతో స్వయంగా లక్ష్మీదేవి కొలువుదీరినట్టే అంటారు. ముందు రోజు తెచ్చుకున్న కొబ్బరికాయను, దీపావళి రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తారు.
(Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!)
తులసి : ఇక తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గాలిని శుభ్రం చేసే తులసి ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీపావళి రోజున తులకి మొక్కను ఇంటి ముందు ప్రతిష్టించు భక్తితో పూజిస్తేఅంతా శుభం కలుగుతుంది అంటారు.
దాన ధర్మాలు
దీపావళి రోజు మనకు మనమే సంబరాలు చేసుకోవడం కాకుండా, పేదవారికి లేనివారికి దానాలు చేస్తే ఆరోగ్య వృద్ధి, ఆయు వృద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు. నమ్ముతారు. కొత్తబట్టలు, ఆహార ధాన్యాలు, తెల్లని వస్త్రాలు, చీపురు, పంచదార, బెల్లం, బియ్యం దానం చేస్తే అంతాశుభాలు జరుగుతాయంటారు.
నోట్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం అందించినది మాత్రమే.