వాహనాల లీజింగ్‌కు మొగ్గు చూపుతున్న నేటి తరం
డౌన్‌పేమెంట్లు, బీమా చెల్లింపులు, నిర్వహణ సమస్యలుండవు
నెలవారీ లీజు చెల్లిస్తే సొంత కారులానే వాడుకోవచ్చు
లీజు గడువు ముగిశాక వెనక్కి ఇచ్చేసి కొత్తది తీసుకునే వెసులుబాటు
రెండు మూడేళ్లకూ కార్లు మార్చాలనుకునేవారికి అనుకూలం
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న ట్రెండ్
రకరకాల లీజింగ్ విధానాలు..
ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్‌లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్. మరి కారు కొనాలంటే...?
బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్‌పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం...
– సాక్షి, వెల్త్ డెస్క్
లీజుపై ఆసక్తి ఎందుకంటే...
→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్‌యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్ పేమెంటూ కావాలి.
→ లీజుకు తీసుకుంటే డౌన్‌పేమెంట్ అక్కర్లేదు.
→ అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు.
→ పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.
→ కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు.
లీజింగ్ అనుకూలమేనా?
అనుకూలమనే చెప్పాలి.
ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.
వీరికి కొనుక్కుంటేనే బెటర్...
కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి.
అసలు ఏంటీ లీజింగ్?
→ లీజింగ్ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.
లీజు కంపెనీల్లో తేడాలేంటి?
→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి.
→ ఒరిక్స్‌కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలందిస్తోంది. లాకిన్ పీరియడ్ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది.
→ మైల్స్ లాకిన్ పీరియడ్ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్ వద్దనుకునే వారికిది అనుకూలం.
→ రెవ్ సంస్థ నెలరోజుల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్‌తో ఈఎంఐ లీజింగ్‌నూ అందిస్తోంది. హ్యుందాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.
→ కారు లీజింగ్
→ కారు కొనడం
ఏకమొత్తం చెల్లింపు
→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్
→ 15–20 శాతం డౌన్‌పేమెంట్‌తో పాటు బీమా, ఆన్‌రోడ్ చార్జీలు.
నెలవారీ ఎంత?
→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి)
→ ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.
ఓనర్‌షిప్
→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి.
→ రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్ చేయొచ్చు.
పన్ను ప్రయోజనాలు
→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే.
→ నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే..
→ కార్పొరేట్ లీజింగ్
→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్ ట్యాక్స్, బ్రేక్‌డౌన్ సపోర్ట్ అన్నీ లీజింగ్ కంపెనీయే చూసుకుంటుంది.
→ ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్‌కు
→ సానుకూలాంశాలు: డౌన్‌పేమెంట్ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు.
→ ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్ పీరియడ్. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.
→ లీజ్ టు ఓన్
→ లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది.
→ ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి.
→ కార్ సబ్‌స్క్రిప్షన్
→ దీన్లోనూ డౌన్‌పేమెంట్ ఉండదు. బీమా,
సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్‌తో మైల్స్, రెవ్, క్విక్‌లిజ్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి.
→ ఈ విధానంలో క్రెటా వంటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు నెలకు రూ.30వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
→ నెలవారీ రెంటల్స్...
→ తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్‌కి కనుక తామే డ్రైవ్ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్‌కార్, రెవ్, మైల్స్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి.
→ ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్ పీరియడ్ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.
→ కార్ల కంపెనీల సబ్‌స్క్రిప్షన్...
→ మారుతి, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు.
→ స్విఫ్ట్ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్ సపోర్ట్‌తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.
డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్
దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్‌స్కిప్షన్ ఫోన్లు, కో–లివింగ్ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు.
డౌన్‌పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్‌మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్‌తో దీర్ఘకాల కమిట్‌మెంట్లు ఉండవు. సబ్‌స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్‌లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్‌గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్.
– ఎడిటర్


