సాక్షి, ఖమ్మం: తల్లాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. మృతులను జనగామ జిల్లా వాసులుగా గుర్తించారు.
విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ, అనిల్, అజయ్, క్రాంతి, రాకేష్ విహారయాత్రకు వెళ్లారు. పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జనగామకు వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద లారీ.. కారును ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే బాలకృష్ణ, అనిల్ మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్, క్రాంతి మృతి చెందారు. మృతులు బాలకృష్ణ, అనిల్‌ను జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామస్తులుగా గుర్తించారు. క్రాంతి, రాకేష్ స్టేషన్ ఘనపూర్ గ్రామస్తులుగా గుర్తించారు.



