అరుదైన ‘గజసంహార వీరగాళ్లు’ | - | Sakshi
Sakshi News home page

అరుదైన ‘గజసంహార వీరగాళ్లు’

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

అరుదైన  ‘గజసంహార వీరగాళ్లు’

అరుదైన ‘గజసంహార వీరగాళ్లు’

చింతకాని: పూర్వీకుల పరాక్రమానికి నిదర్శనంగా నిలిచే రెండు అరుదైన చారిత్రక చిహ్నాలను గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు భోగా గిరి తెలిపారు. జిల్లాలోని చింతకాని మండలం పాతర్లపాడులో ఒకటి, ఖమ్మం మేదరిబజార్‌లో ఇంకొకటి బయటపడగా గజసంహార వీరగాళ్లుగా తేల్చినట్లు వెల్లడించారు. కాలక్రమాణ చారిత్రక కథలు మరుగున పడిపోయినా ఈ చిహ్నాలు వీరుల పరాక్రమం, త్యాగాన్ని సజీవంగా నిలుపుతున్నాయని తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి అరుదైన శిల్పాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement