పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు | YSRCP Pudi Srihari Arrest Updates | Sakshi
Sakshi News home page

పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు

Apr 16 2026 7:29 AM | Updated on Apr 16 2026 8:36 AM

YSRCP Pudi Srihari Arrest Updates

సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈసారి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు.

తక్షణం స్పందించిన వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో పూడి శ్రీహరిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి కుప్పం తీసుకువచ్చారు. ఇక, కుప్పం పీఎస్‌ నుంచి వైద్య పరీక్షల కోసం గురువారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం, తిరిగి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరికాసేపట్లో కుప్పం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు శ్రీహరిని హాజరుపర్చనున్నారు పోలీసులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement