పెన్షనర్ల బకాయిలు విడుదల కోసం కృషి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల బకాయిలు విడుదల కోసం కృషి

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

పెన్షనర్ల బకాయిలు విడుదల కోసం కృషి

పెన్షనర్ల బకాయిలు విడుదల కోసం కృషి

ఖమ్మంమామిళ్లగూడెం: పెన్షనర్ల ఎదురుచూస్తున్న బకాయిల విడుదల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలో గురువారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారి బకాయిల కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయమై వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశంలో వెస్లీ, కోటేశ్వరరావు, బొల్లు రాంబాబు, శ్యాంసుందర్‌రెడ్డి, మైస నాగయ్య, ఈశ్వర్‌కుమార్‌, వెంకటనారాయణ, ఉపేందర్‌రావు, సాంబశివరావు, రమణయాదవ్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement