కొన్ని సందర్భాల్లో.. అనేక కారణాల వల్ల రైలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు లేదా రైలు రావడం ఆలస్యం కావొచ్చు. AC యూనిట్లు పనిచేయకపోవచ్చు, కోచ్ కాన్ఫిగరేషన్‌లు మారవచ్చు, రైలును పూర్తిగా దారి మళ్లించనూవచ్చు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టీడీఆర్ లేదా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ఉపయోగించుకోవడం ద్వారా.. మొత్తం డబ్బు రీఫండ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు.
టీడీఆర్ సేవను ఉపయోగించడం వల్ల.. తన డబ్బు మొత్తం రీఫండ్ అయిందని.. ఒక ఎక్స్ యూజర్ తన అనుభవాన్ని పేర్కొన్నారు.
ఎక్స్ యూజర్, తన భార్య రైలులో సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే ట్రైన్ ఏడు గంటలు ఆలస్యమైందని IRCTC నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ట్రైన్ ఆలస్యం కావడంతో బస్సులో ప్రయాణించాలనుకున్నాము. అయితే ట్రైన్ టికెట్ కోసం పెట్టిన డబ్బును రీఫండ్ పొందడానికి.. TDR దాఖలు చేసి, రైలు 3 గంటలకు పైగా ఆలస్యం అయిందని.. నేను రైలులో ప్రయాణం చేయలేదనే రీజన్ ఎంచుకున్నాను. రీఫండ్ కూడా త్వరగానే ప్రారంభమైంది, డిసెంబర్ 1న వచేశాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తోటి ప్రయాణీకులను కూడా కోరారు.
ఇదీ చదవండి: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్‌గా..
టీడీఆర్ గురించి
నిజానికి TDR అనేది కొత్త సర్వీస్ కాదు. అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ట్రైన్ మూడు గంటలు ఆలస్యమైనప్పుడు, సరైన టికెట్ ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయలేనప్పుడు, ప్రయాణం సమయంలో ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. టీడీఆర్‌ను తప్పనిసరిగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫైల్ చేయాలి. రైలు బయలుదేరిన నాలుగు గంటల్లోగా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
Received Message from IRCTC that Train was 7 hours late. Booked a Bus Ticket to the Destination.
Instead of Cancelling Train Ticket, Filed TDR on Nov 30th 2025.
Refund initiated on Dec 1st 2025.
Super Fast. Credit where due for timely communication from Railways 👍… pic.twitter.com/weZiQNuenT— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) December 1, 2025


