భారతీయ రైల్వేల ఆధునికీకరణ నేపథ్యంలో త్వరలో ప్రారంభించబోయే వందే భారత్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బోగీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో వీటి తయారీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే ఇటీవల అక్టోబర్ 15న ఢిల్లీలో జరిగిన ఇండియన్ రైల్వే ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ (ఐఆర్ఈఈ) 2025లో ఈ ఏసీ స్లీపర్ కోచ్‌ను ప్రదర్శించారు.
సుదూర, మధ్యస్థ ప్రయాణాలకు విమానం లాంటి సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైళ్లను ఆటోమేటిక్ డోర్లు, వైఫై సదుపాయం, విమానం (ఎయిర్ క్రాఫ్ట్)లాంటి డిజైనింగ్‌లో రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: 30 ఏళ్ల టోల్ పాలసీలో మార్పులు?
🚨 The future of Indian Railways is getting ready.
Vande Bharat sleeper version 👌 pic.twitter.com/acD7JgUqJa— Indian Tech & Infra (@IndianTechGuide) November 9, 2025


