
వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. కష్టాలు కన్నీళ్లు ఎన్ని వచ్చినా ఓపిగ్గా ఉంటూ కృషిని నమ్ముకోవాలి. వీటన్నింటికి తోడు మట్టిని ప్రేమించాలి. అపుడు మాత్రమే ఊహించని ఫలితాలు సాధ్యం. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నాడు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
కర్ణాటకకు చెందిన ఉమేశ్ రావు మునగ సాగుతో భారీ లాభాలు సాధించిన తనలాంటి ఔత్సాహిక రైతులకు ప్రేరణగా నిలిచాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది ఎకరాలకు పైగా చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించాడు. కానీఆశించిన ఫలితాలు పెద్దగా లభించ లేదు. ఇంతలో మొరింగ సాగు గురించి తెలుసుకున్నాడు.
2010లో మొరింగ ఒలిఫెరా మొక్క విత్తనాలను నాటాడు ఉమేష్. దాదాపు 900 మొక్కలతో తన జర్నీని మొదలు పెట్టాడు. మొదట్లో మునక్కాయలను క్రమంగా మునగాకు పౌడర్‌ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ కనుగుణంగా ఇతర పంటలను నిలిపివేసి సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.
చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
ఇది ఇలా ఉండగా భూవిషయంలో కుటుంబ వివాదం నేపథ్యంలో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్‌లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు మోరింగ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇట్లా చిన్నమొత్తంలో కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్‌ను స్టడీ చేసి మెరుగైన (ఓడీసీ-3 వెరైటీ) చెందిన మొక్కలను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.
ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్‌ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. ఎక్స్‌ట్రాక్టర్లు, ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు ,ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీని ఫలితంగా ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు.
ఇదీ చదవండి: 45 కిలోలకు పైగా వెయిట్‌లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!
ఏడాదికి రూ. 40 లక్షలు
అలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్‌కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు.