
బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాల కలయికతోనే సాధ్యం.అందులోనూ గుట్టలా పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ వదిలించుకోవడం అంత సులువు. కొంత సమయం దాటిన తరువాత అంది మొండిగా మారిపోతుంది. ఒక పట్టాన కరగదు. అందుకు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సిందే. ఒక మహిళ అయిదు కోర్ వ్యాయామాల ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకుంది. దాదాపు 45 కిలోలకు పైగా తగ్గింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
వెయిట్ లాస్ జర్నీ గురించి తన ఫాలోయర్లతో నిరంతరం షేర్ చేసే ఫెర్నాండా ఇటీవల తన అదనపు కిలోలను తగ్గించుకోవడానికి సహాయపడిన కొన్ని ఉత్తమ వ్యాయామాల గురించి చెప్పు కొచ్చింది. అవేంటో చూద్దాం

డంబెల్ రష్యన్ ట్విస్ట్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి రష్యన్ ట్విస్ట్ బెస్ట్ ఆప్షన్ అని తెలిపింది.దీనికి కోర్ కండరాలు ( వెన్నెముక, కటి, దర కండరాలు,దిగువ వీపు,డయాఫ్రాగమ్) భుజం బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మంచి ఫలితాలకోసం 3 సెట్లు 25 సార్లు చేసిందిఫెర్నాండా .
ఎలా చేయాలి? : నేలపై 'V' షేప్‌లో మోకాళ్లను వంచి, భుజాలు స్థిరంగా ఉండేలా కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి రెండు చేతులతో మీ ఛాతీ వద్ద డంబెల్‌ను పట్టుకుని, నడుమును నెమ్మదిగా ఎడమ నుండి కుడికి తిప్పాలి. దీన్ని రెండు వైపులా రిపీట్ చేయాలి.
లెగ్ రైజ్: పొత్తికడుపు, దిగువ ఉదర కండరాలను బలోపేతం చేయడానికి ఇది చాలా బాగ పనిచేస్తుంది లెగ్ రైజ్ ఎక్స్‌ర్‌సైజ్ 3 సెట్లు పది సార్లు చేసేదట. నేలపై సమాంతరంగా పడుకుని కాళ్లను పైకి లేపడం. ఇలా చేసేటపుడు, పొత్తికడుపుపై ఒత్తిడిపెంచుతు మోకాళ్లను వంచకుండా చేయాలి. దీని పొత్తికడుపు కొవ్వు కరుగుతుంది. దీన్ని చాలా రకాలుగా చేయవచ్చు
ఆల్టర్‌నేటింగ్ లెగ్ రైజెస్
వెయిట్‌లాస్‌లో ఇది మరో మంచివ్యాయామం. ఇది పొట్ట కొవ్వును బాగా కరిగిస్తుంది. నేలపై పడుకుని, ఒక కాలు తరువాత మరో కాలు నిటారుగా పైకి లేపుతూ చేయాలి.
బాడీని నిటారుగా నేలపై ఉంచి, ముంజేతులపై ప్లాంక్ పొజిషన్‌లో ఉండాలి.
ఒక కాలును పైకి లేపి. ఒక సెకను పాటు పట్టుకుని, నెమ్మదిగా కిందకు దించాలి.
మరొక కాలుతో దీన్ని రిపీట్ చేయాలి.
లెగ్ రైజ్ హోల్డ్: వెల్లకిలా పడుకుని, కాళ్ళు నిటారుగా చాపి, చేతులు పక్కన ఉంచే వ్యాయామం.నేలపై పడుకుని కాళ్ళను నేల నుండి 45 డిగ్రీల కోణంలో పైకి లేపి, కొద్దిసేపు పట్టుకుని ఉండాలి, ఆపై నెమ్మదిగా కిందికి దించాలి.
డంబెల్ హాఫ్ క్రంచ్ : నేల మీద పడుకొని, మోకాళ్లను వంచి, పాదాలను నేలపై ఉంచి రెండు చేతులతో సౌకర్యవంతంగా డంబెల్ పట్టుకోవాలి. డంబెల్‌తోపాటు బాడీని పైకి ఎత్తేటప్పుడు శ్వాస వదులుతూ, పైకి లేపి కొద్దిసేపు హోల్డ్ చేసి, నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును కరిగించి, కండరాలను దృడం చేస్తుంది. ఈ వ్యాయామాలతో పాటు, లోఫ్యాట్ డైట్‌ను పాటిస్తూ 45 కిలోలకు పైగా బరువు తగ్గింది.
నోట్ : ఫెర్నాండా విషయంలో వ్యాయామాలు,ఆహారం అద్భుతాలు చేసినప్పటికీ. మన బాడీకి ఏది కరెక్ట్ అది నిర్ధారించుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి,ఎన్ని కేలరీలు అవసరం, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.