దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..! | Rs 250 charged for Rs 75 parking fee At sabarimala | Sakshi
Sakshi News home page

దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..!

Nov 30 2025 1:15 PM | Updated on Nov 30 2025 1:29 PM

Rs 250 charged for Rs 75 parking fee At sabarimala

సాక్షి ఎరుమేలి: దేవస్వం బోర్డు యాత్రికుల వాహనాల పార్కింగ్‌పై ఫిర్యాదుల కలకలం. దేవస్వం బోర్డు ఒప్పందం కుదుర్చకున్న మొత్తం కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తక్కణమే రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలంటూ మండిపడితున్నారు యాత్రికులు. నిజానికి దేవస్వం బోర్డు ప్రయాణికులు వాహనాల పార్కింగ్‌ ఫీజును రూ. 75గా నిర్ణయించగా, కర్ణాటకు చెందిన యాత్రికుల వాహనాలకు అధిక మొత్తంలో రూ. 250 వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హిందూ సంస్థలు, పోలీసులు జోక్యం మేరకు అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. 

అదీగాక కొంతమొంది యాత్రికులు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి రెవెన్యూ కంట్రోల్ రూమ్ బృందానికి ఫోన్ చేశారని, అలాగే వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారే గానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిందూ సంస్థ ఆఫీస్ బేరర్లు ఆరోపించారు. ఈ మేరకు అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర కార్యదర్శి ఎస్. మనోజ్ నేతృత్వంలో కొందరూ  సంఘటన స్థలానికి చేరుకుని అధిక రుసుములు వసూలు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

అధిక రుసుములు వసూలు చేసినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించినప్పటికీ, చర్యలు తీసుకోవాల్సింది తాము కాదని చెప్పడం గమనార్హం. అదీగాక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనా చర్యలు తీసుకుంటామనేది పోలీసుల వాదన. గత వారంన్నర కాలంలో యాత్రికుల వాహనాల నుంచి సుమారు మూడు రెట్లు పార్కింగ్ రుసుము వసూలు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం దేవస్వం బోర్డు సైతం  చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆఖరికి తిరిగి వెళ్లేటప్పుడూ కూడా ..
దేవస్వం బోర్డు మైదానంలోని కాంట్రాక్టర్లు బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు. పైగా దేవస్వం బోర్డు ఒప్పందం ప్రకారం, పార్కింగ్ రుసుముకు రశీదు ఇవ్వాలి. అంతేగాదు దోపిడీ పెరగడంతో, దేవస్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీలు వేసిన రశీదును జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా. అదీగాక వాహనాలు పార్కింగ్ మైదానంలోకి ప్రవేశించిన వెంటనే రశీదు జారీ చేయాలన్న ఆదేశం. అయితే అందుకూ విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ మైదానం నుంచి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు డబ్బు వసూలు చేస్తున్నాట్లు సమాచారం.

నోటీసులు జారీ ..
యాత్రికుల వాహనాలకు అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో కాంట్రాక్టర్‌కు దేవస్వం బోర్డు నోటీసులు జారీ చేస్తుంది. అలాగే ఒప్పంద ఉల్లంఘనకు గానూ తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. 

(చదవండి: బుకింగ్‌ పాస్‌లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..! హైకోర్టు)

 

Advertisement
 
Advertisement
Advertisement