Waste into Energy : కిచెన్‌ వేస్ట్‌ నుంచి బయోగ్యాస్‌ | Harini Ravi Kumar startup makes Kitchen Waste into Cooking Gas | Sakshi
Sakshi News home page

Waste into Energy : కిచెన్‌ వేస్ట్‌ నుంచి బయోగ్యాస్‌

May 3 2025 3:02 PM | Updated on May 3 2025 3:20 PM

Harini Ravi Kumar startup makes Kitchen Waste into Cooking Gas

హరిణి.... హరిత ఇంధనం 

అసాధారణ జ్ఞానం నుంచి మాత్రమే కాదు అవసరాల నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి అని చెప్పడానికి హరిణి ఒక ఉదాహరణ. వంటగది వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను తయారుచేసే ఆలోచన చేసి విజయవంతం అయింది. ఆ ఆలోచన తనను ఎంట్రప్రెన్యూర్‌ని చేసింది.

తమిళనాడులోని సేలంకు చెందిన హరిణి రవికుమార్‌ ‘గ్రీన్‌ కనెక్ట్‌’ వ్యవస్థాపకురాలు. ‘గ్రీన్‌ కనెక్ట్‌’ దేశవ్యాప్తంగా వెయ్యి బయోగ్యాస్‌   ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ΄్లాంట్లు సేంద్రియ వ్యర్థాలను విలువైన ఇంధన శక్తిగా మారుస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటాయి. (స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!)

హౌజ్‌హోల్డ్‌ కార్బన్‌ ఫుట్‌ప్రింట్స్‌ను తగ్గించడానికి ఆచరణాత్మక, శక్తిమంతమైన మార్గాలను ‘గ్రీన్‌ కనెక్ట్‌’ అందిస్తుంది. సహజమైన ప్రక్రియ ద్వారా వంటగది వ్యర్థాలను వంట ఇంధనంగా మార్చడానికి రూ పొందించిన ఈ యూనిట్‌ను బాల్కనీలు, టెర్రస్‌లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది వ్యర్థాలతో బయోగ్యాస్, సేంద్రియ ఎరువుతో పాటు పోషకాలు అధికంగా ఉండే కంపోస్ట్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగ పడుతుంది. (వాటర్‌ ఫిల్టర్‌ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!)

ఇలా....

  • చెత్తను సేకరించిన తరువాత నాన్‌–ఆర్గానిక్‌ వేస్ట్‌ నుంచి ఆర్గానిక్‌ వేస్ట్‌ను వేరు చేయాలి.

  • ఆర్గానిక్‌ వేస్ట్‌ను ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌ లేదా డైజెస్టర్‌లో వేయాలి.

  • టైట్‌ చాంబర్‌లో బయోగ్యాస్‌ను స్టోర్‌ చేయాలి.

  • స్టోర్‌ చేసిన బయోగ్యాస్‌ను వంట గ్యాస్‌గా ఉపయోగిస్తారు.
     

Advertisement
 
Advertisement
Advertisement