అనుకుంది... గెలిచింది! | Shreya N Gowda has secured the first rank in the UPSC NDA examination | Sakshi
Sakshi News home page

అనుకుంది... గెలిచింది!

Nov 12 2026 4:35 AM | Updated on Nov 12 2026 4:35 AM

Shreya N Gowda has secured the first rank in the UPSC NDA examination

→ గెలుపు కెరటాలు

‘అలా కాదమ్మా నువ్వు డాక్టరే కావాలి, ఇంజినీరే కావాలి’ అని తల్లిదండ్రులు అని ఉంటే శ్రేయ గౌడ దేశం దృష్టిని  ఆకర్షించేది కాదు. కర్నాటకలోని భద్రావతి తాలూక 
తిమ్మపుర గ్రామానికి చెందిన శ్రేయ ఎన్‌ గౌడ యూపీఎస్‌సీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఎ), నేషనల్‌ అకాడమీ ఎగ్జామ్‌(1)–2026లో మహిళా విభాగంలో ప్రథమ స్థానం సాధించింది...

సుప్రీంకోర్టు తీర్పుతో 2021లో మహిళలకు ఎన్‌డీఏలో ప్రవేశం కల్పించారు. ‘అమ్మాయిలు కూడా ఎన్‌డీఏలో చేరవచ్చునని తెలిసి నేను చాలా సంతోషించాను. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం దగ్గరకి వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంది శ్రేయ. ఇక అప్పటి నుండి ఆమె తన కలలను సాకారం చేసుకోవడానికి నిర్మాణాత్మక కృషి ప్రారంభించింది. క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేయడం, రోజూ దినపత్రికలు చదవడం, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడంలాంటివి చేసేది.

ఇంటర్వ్యూ... చాలా కష్టం!
పదవతరగతిలో తాలూకాలోనే మొదటి ర్యాంక్‌ సాధించిన శ్రేయ బేస్‌ పీయూ కాలేజీలో ఉన్నత విద్య చదవడానికి, జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ)కు సిద్ధం కావడానికి బెంగళూరుకు వెళ్లింది. మ్యాథ్స్, సైన్స్‌లో రెండు సంవత్సరాలు బాగా కష్టపడడం ఎన్‌డీఏ రాత పరీక్షలో ఆమెకు బాగా ఉపయోగపడింది. ఆ పరీక్ష జెఈఈ కంటే సులభంగా అనిపించింది! అయిదురోజుల పాటు జరిగిన సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ మాత్రం ఆమెకు కష్టంగా అనిపించింది. అయితే ఆ కష్టాన్ని కూడా అధిగమించింది.‘రాతపరీక్షకు సంబంధించి నాకు పూర్తి నమ్మకం ఉండేది. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియ మాత్రం భిన్నంగా ఉంటుంది’ అంటుంది శ్రేయ.

అనుకుంది...సాధించింది!
శ్రేయ తండ్రి నాగేంద్ర, విశ్వేశరయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ΄్లాంట్‌ (విఐఎస్‌ఎల్‌)లో, తల్లి ఆశ కామర్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులతో పాటు కజిన్స్‌ కూడా శ్రేయాను ఎంతో ప్రోత్సహించారు. సూరత్‌కల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్నాటక(ఎన్‌ఐటీకే)లో చదువుతున్న శ్రేయ తన ఇంజినీరింగ్‌ కోర్సును వదిలేసి పుణేలోని ఖడక్‌వాస్లాలో ఉన్న ఎన్‌డీఏలో చేరబోతుంది. ‘చిన్నప్పటినుంచి శ్రేయ చదువులో ముందుండేది. నేను పెద్దయ్యాక సైన్యంలో చేరుతాను అంటూ ఉండేది. తాను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటుంది శ్రేయ తల్లి ఆశ.

కుటుంబ ప్రోత్సాహం... ఎంతో బలం
మార్కుల విషయంలో, కెరీర్‌ ఎంపిక విషయంలో నా తల్లితండ్రులు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ‘నీకు ఏది సంతోషంగా అనిపిస్తే అది చెయ్యి’ అని చెప్పేవారు. పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. లక్ష్యం ఉండగానే సరిపోదు. మన లక్ష్యంపై స్పష్టంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనలోనే దాచుకోకుండా కుటుంబసభ్యులకు తెలియజేయాలి. వారి ప్రోత్సాహం మనకు చెప్పలేనంత బలం అవుతుంది. మీరు ఏంకావాలనుకుంటున్నారో ప్రపంచానికి చెప్పే ధైర్యం మీలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనిపెట్టాలి. ఆ మార్గం వెంట నడుస్తూ కష్టపడాలి.
–శ్రేయ ఎన్‌ గౌడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement