ప్రజా సేవల్లో వేగం పెరగాల్సిందే  | PM Narendra Modi Addressing the UPSC centenary celebrations event | Sakshi
Sakshi News home page

ప్రజా సేవల్లో వేగం పెరగాల్సిందే 

Oct 2 2026 6:15 AM | Updated on Oct 2 2026 6:15 AM

PM Narendra Modi Addressing the UPSC centenary celebrations event

ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే సేవలు అందిస్తే సరిపోదు  

సివిల్‌ సర్వీసెస్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి 

యూపీఎస్సీ శత వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి  

న్యూఢిల్లీ: నేటి ఆధునిక యుగంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వేగవంతమైన, రియల్‌–టైమ్‌ సేవలు, పరిష్కారాలను పౌరులు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకు అనుగుణంగా సాంప్రదాయ సేవా పంపిణీ విధానాలు సైతం పరిణామం చెందాలని స్పష్టంచేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో మౌలిక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 

అభ్యర్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం కాకుండా ప్రజాసేవ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని పేర్కొన్నారు. కేవలం విద్యా పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా అభ్యర్థుల్లోని అంతర్లీన ప్రేరణను సైతం సక్రమంగా మూల్యాంకనం చేసేలా ఎంపిక ప్రమాణాలు ఉండాలని తేలి్చచెప్పారు. నియామక పరీక్ష అనేది కేవలం అభ్యర్థికి ఏమి తెలుసో పరీక్షించడానికే పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. యువత సివిల్‌ సరీ్వసెస్‌లో ఎందుకు చేరాలని ఆకాంక్షిస్తుందో కూడా పరిశీలించాలని అన్నారు. గురువారం ఢిల్లీలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) శతవార్షిక ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు.

 మనదేశం క్రమంగా పట్టణీకరణ చెందుతోందని, అదే సమయంలో యువత ఆకాంక్షలు గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. వారి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని అన్నారు. కాబట్టి ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే సేవలు అందిస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. తక్షణమే సేవలు కోరుకుంటున్న ప్రపంచ వేగానికి అనుగుణంగా ప్రభుత్వ సేవలు సాగుతున్నాయా లేదా అనేది ప్రశ్నించుకోవాలని ఉద్ఘాటించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ సేవల్లోనూ వేగం పెరగాలని స్పష్టంచేశారు. 

నేడు పౌరులు ప్రభుత్వ సేవల కోసం వారాల తరబడి లేదా నెలల తరబడి వేచి ఉండాలని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ క్షణాల్లో వేలాది పత్రాలను ప్రాసెస్‌ చేయగలిగినప్పుడు, ప్రభుత్వాలకు రియల్‌ టైమ్‌ డేటా అందుబాటులో ఉన్నప్పుడు పౌరులు వేగవంతమైన పరిష్కారాలను ఆశిస్తారని ప్రధానమంత్రి వెల్లడించారు. మారుతున్న ఈ ఆలోచనా విధానం ప్రకారం మన సివిల్‌ సర్వీసెస్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఎంపిక ప్రమాణాలను, నియామక ప్రక్రియలను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement