మెరుగైన మచ్ఛార్‌ ఆరోగ్యం | Flydubai Captain Smit Machchhar Recovering In Saudi Hospital | Sakshi
Sakshi News home page

మెరుగైన మచ్ఛార్‌ ఆరోగ్యం

Oct 2 2026 6:02 AM | Updated on Oct 2 2026 6:02 AM

Flydubai Captain Smit Machchhar Recovering In Saudi Hospital

దుబాయ్‌: కోపైలట్‌ దాడిలో కత్తిపోట్లకు గురైనకె ప్టెన్‌ మచ్ఛార్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యాధికారులు గురువారం స్పష్టంచేశారు. సౌదీలోని తబుక్‌ నగర ఆస్పత్రి ఐసీయూలో మచ్ఛార్‌కు తొలుత చికిత్స చేశారని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. తబుక్‌ ఆస్పత్రిలో చికిత్స తర్వాత మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఆయనను గురువారం విమానంలో యూఏఈలోని అబుదాబి నగరానికి తరలించి అక్కడి ఒక ఆస్పత్రిలో చేరి్పంచారు. కత్తిపోట్లతో మచ్ఛార్‌ మెడ, చేతుల వద్ద లోతైన గాయాలయ్యాయి. ఈ గాయాలకు సంబంధించి అత్యయిక శస్త్రచికిత్స పూర్తిచేశారు.

 విమానంలో ఫ్లోర్‌మీద పడిపోయిన మచ్ఛార్‌కు ఛాతి, పొత్తికడుపు చూట్టూతా బ్యాండేజీలు చుట్టినట్లు వీడియోలో ఉంది. ఈ గాయాలకు సైతం వైద్యులు చికిత్స చేస్తున్నారు. కత్తిపోట్ల గాయాల నుంచి మరింత రక్తస్రావం కాకుండా తగు చికిత్సచేశారు. ఎలాంటి సర్జరీ జరిగింది? ఎన్ని కుట్లు పడ్డాయి? అనే వివరాలను వైద్యులు బహిర్గతంచేయలేదు. ఆయన హెల్త్‌ బులెటిన్‌ను సైతం విడుదలచేయలేదు. కానీ మచ్ఛార్‌ ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం ఆయన కుటుంబసభ్యులకు చేరవేస్తున్నామని జెడ్డాలోని భారత మిషన్‌తోపాటు కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ‘‘అత్యంత మెరుగైన వైద్యసేవలు ఆయనకు అందేలా చూస్తున్నాం. ఈ మేరకు అధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం’’అని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఇండియన్‌ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement