breaking news
co-pilot crashed plane
-
మెరుగైన మచ్ఛార్ ఆరోగ్యం
దుబాయ్: కోపైలట్ దాడిలో కత్తిపోట్లకు గురైనకె ప్టెన్ మచ్ఛార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యాధికారులు గురువారం స్పష్టంచేశారు. సౌదీలోని తబుక్ నగర ఆస్పత్రి ఐసీయూలో మచ్ఛార్‌కు తొలుత చికిత్స చేశారని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. తబుక్ ఆస్పత్రిలో చికిత్స తర్వాత మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఆయనను గురువారం విమానంలో యూఏఈలోని అబుదాబి నగరానికి తరలించి అక్కడి ఒక ఆస్పత్రిలో చేరి్పంచారు. కత్తిపోట్లతో మచ్ఛార్ మెడ, చేతుల వద్ద లోతైన గాయాలయ్యాయి. ఈ గాయాలకు సంబంధించి అత్యయిక శస్త్రచికిత్స పూర్తిచేశారు. విమానంలో ఫ్లోర్మీద పడిపోయిన మచ్ఛార్‌కు ఛాతి, పొత్తికడుపు చూట్టూతా బ్యాండేజీలు చుట్టినట్లు వీడియోలో ఉంది. ఈ గాయాలకు సైతం వైద్యులు చికిత్స చేస్తున్నారు. కత్తిపోట్ల గాయాల నుంచి మరింత రక్తస్రావం కాకుండా తగు చికిత్సచేశారు. ఎలాంటి సర్జరీ జరిగింది? ఎన్ని కుట్లు పడ్డాయి? అనే వివరాలను వైద్యులు బహిర్గతంచేయలేదు. ఆయన హెల్త్ బులెటిన్‌ను సైతం విడుదలచేయలేదు. కానీ మచ్ఛార్ ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం ఆయన కుటుంబసభ్యులకు చేరవేస్తున్నామని జెడ్డాలోని భారత మిషన్‌తోపాటు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘‘అత్యంత మెరుగైన వైద్యసేవలు ఆయనకు అందేలా చూస్తున్నాం. ఈ మేరకు అధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం’’అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. -
అంతుచిక్కని ప్రశ్నలు!
జెరూసలేం/దుబాయ్: ఫ్లై దుబాయ్ ఉదంతంలో కెప్టెన్‌ను కోపైలట్ అంత దారుణంగా ఎందుకు పొడిచాడు? ప్రయాణికులందర్నీ చంపబోయిన తనను అడ్డుకున్నందుకు కోపైలట్ పట్టరాని ఆవేశంతో విచక్షణారహితంగా కెప్టెన్‌పై దాడిచేశాడా? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. పిచ్చెక్కినట్లు కీలక వ్యవస్థలను అతను ఎందుకు నాశనంచేయబోయాడు? అనే దానికి కూడా ఏ దర్యాప్తు సంస్థా ఇంకా జవాబు చెప్పే పరిస్థితిలేదు. ప్రస్తుతం సౌదీ పోలీసుల కస్టడీలో ఉన్న కోపైలట్ నోరు విప్పితేగానీ విమాన క్రాష్‌ల్యాండింగ్ కుట్ర వెనక ఉన్నదెవరు? అనే విషయాలు వెల్లడికానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే యూఏఈ పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఘటన జరిగిన విమానం యూఏఈ ప్రభుత్వరంగ పౌరవిమానయాన సంస్థ కావడంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు యూఏఈ అటార్నీ జనరల్ కౌన్సిలర్ హమాద్ అల్ షామీ తెలిపారు. ఇజ్రాయెల్ సైతం దర్యాప్తు మొదలెట్టింది. మరో 9/11 తరహా ఉగ్రదాడి ఘటనగా ఇది పేరొందటంతో అమెరికా సైతం రంగంలోకి దిగబోతోంది. పట్టుబడిన కోపైలట్ ఒమన్ దేశస్తుడని ప్రచారంకావడంతో ఆ దేశం సైతం తమ వైపు నుంచి దర్యాప్తు ఆరంభించే ఆస్కారముంది. ఇన్ని దేశాల దర్యాప్తుల్లో ఏమేం విషయాలు బయటికొస్తాయా అని ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ‘‘ఉగ్రవాదం మొదలు కోపైలట్ వ్యక్తిత్వం, మానసిక సమస్యల దాకా అన్ని కోణాల్లో దర్యాప్తు జరగబోతోంది’’అని సంబంధిత ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదుల హస్తముందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు. ఫాక్స్‌న్యూస్ ఛానల్ వారి ‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్’ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడారు. ‘‘అతనో ఉగ్రవాది. ఇస్లామిక్ మతఛాందసవాది’’అని అన్నారు. ఈ ఘటనలో ఇరాన్ ప్రమేయముందా అని మీడియా అడగ్గా ‘‘ఇప్పుడే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’అని అన్నారు. అయితే తన వాదనలకు గల బలమైన సాక్ష్యాధారాలను ఆయన బయటపెట్టలేదు. కోపైలట్‌ను ప్రశ్నించేందుకు ఇజ్రాయెల్ నిఘా, భద్రతాధికారులు ఇప్పటికే సౌదీకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్తో నెతన్యాహూ ఫోన్ మంతనాల తర్వాత ఇజ్రాయెల్ బృందం సౌదీకి చేరుకుంది. దర్యాప్తు నిమిత్తం అతడిని తమకు అప్పగిస్తే స్వదేశానికి తీసుకెళ్తామని ఇజ్రాయెల్ జాతీయభద్రతా మంత్రి ఇతామర్ బెన్ గవిర్ చెప్పారు. అయితే ఈ అభ్యర్థనపై సౌదీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఆ విమానాన్ని కావాలనే కూల్చేశారా?
సుమారు 150 మంది ప్రాణాలు బలిగొన్న విమాన ప్రమాదానికి కారణం ఎవరు? స్వయంగా ఆ విమాన కో-పైలటే అని ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ చెబుతున్నారు. జర్మనీకి చెందిన జర్మన్వింగ్స్ విమానం ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అతడు కావాలనే విమానాన్ని కూల్చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రియాస్ లబిట్జ్ అనే ఈ కో-పైలట్ మతం ఏమిటన్న విషయం మాత్రం బయటపెట్టలేదు. ప్రమాదం సంభవించడానికి కొంతసేపటి ముందు పైలట్ ఎందుకోగానీ కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లారు. కానీ ఆయన తిరిగి లోపలకు వెళ్లేందుకు కాక్‌పిట్ తలుపు కొట్టినా, కో-పైలట్ మాత్రం తలుపు తీయలేదు. విమానం కూలిపోవడానికి కొద్ది నిమిషాల ముందు వరకు కూడా కో-పైలట్ ఊపిరి సాధారణంగానే తీసుకున్నాడని, ఆయన ఏమాత్రం ఉద్వేగానికి లోనుకాలేదని అన్నారు. అతడు కావాలనే విమానాన్ని కూల్చేయాలనుకున్నట్లు ప్రాసిక్యూటర్ ఆరోపించారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో ఒక్క మాట కూడా రికార్డు కాలేదని, అంటే కో-పైలట్ కావాలనే అంతవరకు నిశ్శబ్దంగా ఉన్నాడని చెప్పారు. సాధారణంగా ఎయిర్‌బస్ ఎ-320 తరహా విమానాల కాక్‌పిట్ చాలా సురక్షితంగా ఉంటుంది. ఒక పైలట్ లోపల ఉండి, మరొకరు బయట ఉంటే తలుపు తెరిచేందుకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఒకవేళ లోపల ఉన్నవాళ్లు తలుపు తీయడానికి నిరాకరించినా..అత్యవసర కోడ్ ఉపయోగించొచ్చు. అప్పటికీ లోపల నుంచి సమాధానం రాకపోతే తలుపు ఆటోమేటిగ్గా తెరుచుకుంటుంది. లోపలి వ్యక్తి బయటివాళ్లకు అనుమతి నిరాకరిస్తే మాత్రం ఐదు నిమిషాల పాటు తలుపు లాక్ అయ్యే ఉంటుంది. ఇవన్నీ చూస్తే.. కో-పైలట్ కావాలనే విమానాన్ని కూల్చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


