జెరూసలెం: ఇజ్రాయెల్ వెళుతున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చేసే ప్రయత్నం చేసిన కో–పైలట్ వెనుక ఇరాన్ ఉన్నట్లు తెలిస్తే ఆ దేశంపై తీవ్రస్థాయి దాడి తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కో–పైలట్ కత్తితో కెప్టెన్‌పై దాడి చేయడంతో ఫ్లై దుబాయ్ విమానం అదుపుతప్పి వేగంగా కిందకు దిగిన విషయం.. సహ ప్రయాణీకులు సకాలంలో అడ్డుకోవడంతో హైజాక్ ముప్పు, 9/11 తరహా దాడిని నివారించడం తెలిసిందే.
కో–పైలట్‌కు, ఇరాన్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని కొందరు విలేకరులు ప్రశ్నించగా.. దర్యాప్తు సాగుతోందని ట్రంప్ సమాధానమిచ్చారు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ ప్రమేయం ఉందన్న ట్రంప్ ఆ అనుమానానికి గల కారణాలను మాత్రం వివరించలేదు. దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు తేలితే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందా అని ప్రశ్నించగా.. ‘‘వారిపై తీవ్రమైన దాడి జరుగుతుంది. ఆందోళన చెందకండి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


