ఏఐతో ‘బీపీఎం’కు కొత్త జోష్‌!  | AI driving major reinvention of India as BPM industry says NASSCOM President | Sakshi
Sakshi News home page

ఏఐతో ‘బీపీఎం’కు కొత్త జోష్‌! 

Oct 1 2026 5:09 AM | Updated on Oct 1 2026 5:09 AM

AI driving major reinvention of India as BPM industry says NASSCOM President

రూ.5 లక్షల కోట్ల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు

ప్రపంచ ‘ఇంటెలిజెంట్‌ ఆపరేషన్స్‌ హబ్‌’గా భారత్‌కు అవకాశం 

నాస్కామ్‌ అధ్యక్షుడు రాజేశ్‌ నంబియార్‌ వెల్లడి

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా భారత బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) పరిశ్రమ కనుమరుగవుతుందనే భయాలను నాస్కామ్‌ అధ్యక్షుడు రాజేశ్‌ నంబియార్‌ కొట్టిపారేశారు. ఏఐ రాకతో బీపీఎం రంగం తనను తాను సరికొత్తగా పునరి్నరి్మంచుకుంటూ మరింత బలోపేతం అవుతుందన్నారు. ‘నాస్కామ్‌ బీపీఎం కాన్‌ఫ్లూయెన్స్‌ 2026’ సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు. భారత్‌కు ఇప్పుడు ప్రపంచ స్థాయి ‘ఇంటెలిజెంట్‌ ఆపరేషన్స్, ట్రాన్స్‌ఫార్మేషన్‌ హబ్‌’ గా ఎదిగే గొప్ప అవకాశం వచ్చిందన్నారు. 

‘‘సుమారు రెండేళ్ల క్రితం జనరేటివ్, ఏజెటింక్‌ ఏఐ తెరపైకి వచి్చనప్పుడు.. బీపీఎం పరిశ్రమ అంతరించిపోతుందన్నారు కంపెనీలు పూర్తిగా కనుమరుగవుతాయని చాలామంది అంచనా వేశారు. కానీ రెండేళ్ల తర్వాత చూస్తే ఆ అంచనాలు పటాపంచలయ్యాయి. పైగా పరిశ్రమ మరింత బలోపేతమైంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది’’ అని నంబియార్‌ ధీమా వ్యక్తం చేశారు.  బీపీఎం రంగంలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ లావాదేవీలు, ప్రామాణిక వర్క్‌ఫ్లోలు, ప్రాథమిక వినియోగదారుల సేవలు ఏఐ ఏజెంట్ల ద్వారా ఆటోమేట్‌ అవుతాయని ఆయన అంగీకరించారు. అయితే ఏఐ వల్ల బీపీఎం రంగానికి ఏం జరుగుతుందనే దానికంటే, ఏఐ శక్తితో ఈ పరిశ్రమ ఎలాంటి విప్లవాత్మక మార్పులు సాధించగలదనేదే అసలు ప్రశ్న అని వ్యాఖ్యానించారు. 

రూ.5 లక్షల కోట్ల బీపీఎం పరిశ్రమ   
గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత బీపీఎం పరిశ్రమ ఆదాయం దాదాపు 60 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.5 లక్షల కోట్లు) చేరిందన్నారు. ఒకప్పుడు కేవలం ‘కాల్‌ సెంటర్ల’కే పరిమితమైన ఈ రంగం, ఇప్పుడు ఏఐ, అనలిటిక్స్, క్లౌడ్‌ ఆపరేషన్స్, ఆటోమేషన్‌ ఆధారిత సేవలకు నిలయంగా మారిందన్నారు. ఒక ప్రక్రియను ఆటోమేట్‌ చేయగలమా? అనే ప్రశ్న నుంచి.. ఏఐని ఉపయోగించి ఆ ప్రక్రియను పూర్తిగా రీ–డిజైన్‌ చేయవచ్చా? అనే దిశగా చర్చలు మారాయన్నారు. గతంలో సంస్థాగత సాంకేతికత కేవలం  రికార్డులు, కస్టమర్‌ అనుసంధానానికే పరిమితమైందన్నారు. ఇప్పుడు ఏఐ ఏజెంట్ల రాకతో సొంతంగా నిర్ణయాలు తీసుకుని పనిచేసే ’సిస్టమ్స్‌ ఆఫ్‌ యాక్షన్‌’ అనే మూడో విభాగం రూపుదిద్దుకుంటోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement