breaking news
Indian business
-
బాధ్యతాయుతంగా ఏఐ స్వీకరణ
న్యూఢిల్లీ: ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత విషయంలో భారతీయ వ్యాపార సంస్థలు బాధ్యతాయుత పద్ధతులు, విధానాలను అవలంభిస్తున్నట్టు నాస్కామ్ సర్వేలో తేలింది. అటువంటి పద్ధతులు, విధానాల అమలుకు చర్యలను ప్రారంభించినట్టు 60 శాతం కంపెనీలు తెలిపాయి. వీటిలో 89 శాతం వ్యాపార సంస్థలు శ్రామికశక్తి సున్నితత్వం, శిక్షణలో పెట్టుబడులను కొనసాగించడానికి నిబద్ధతగా ఉన్నాయి. భారత్‌లో ఏఐ వాణిజ్య అభివృద్ధి, వినియోగంలో నిమగ్నమైన పెద్ద సంస్థలు, ఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు చెందిన 500 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ‘బాధ్యతాయుత ఏఐ ఆవశ్యకతపై ప్రాథమిక అవగాహన కలిగి ఉన్నట్లు 30 శాతం సంస్థలు వెల్లడించాయి. ఏఐ వినియోగదారులు, వాటాదారులలో బాధ్యతాయుత ఏఐ కోసం పెరుగుతున్న అవసరం పరిశ్రమ నాయకులకు అధునాతన సాధనాలు, వ్యూహాలలో పెట్టుబడులతోపాటు ఏఐ పద్ధతులలో పారదర్శకతను నొక్కి చెబుతోంది’ అని నివేదిక వివరించింది. -
వరల్డ్ కప్ ఫైనల్, దేశంలో బిజినెస్ అప్ & డౌన్
ప్రపంచకప్ ఫైనల్లో అహ్మాదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియాలో హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రభావం భారత్‌లోని పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆయా రంగాలకు చెందిన వ్యాపార విభాగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వాటిల్లో యూపీఐ లావాదేవీలు డల్ మ్యాచ్ జరిగే సమయంలో యూపీఐ చెల్లింపులతో సహా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. జనమంతా మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉండడంతో.. UPI ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోతాయని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా UPIలపై తీవ్రప్రభావం పడింది. కేవలం ఫుడ్ ఆర్డర్, హోటళ్ల బిజినెస్ మాత్రం జరిగింది. గత ఏడాది దీపావళి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు UPI లావాదేవీలు పూర్తిగా క్షీణించాయి. కింద ఇచ్చిన గ్రాఫ్ లో ఆ వివరాలను గమనించవచ్చు. ముఖ్యంగా కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు UPIలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత లావాదేవీలు సాధారణంగా మారాయి. అమ్మకాలలో హెచ్చుతగ్గులు ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో ఆన్లైన్ విక్రయాలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. టీమ్ జెర్సీలు, ఫ్లాగ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరగవచ్చు. మరోవైపు, ప్రజలు మ్యాచ్‌పై దృష్టి సారించడంతో క్రీడలకు సంబంధించిన ఆన్లైన్ విక్రయాలు భారీగా క్షీణించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్‌లు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బెట్టింగ్ యాప్స్ వినియోగం విపరీతంగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం లేదా గేమ్‌లోని వివిధ ఈవెంట్లపై బెట్టింగ్‌పై ఎక్కువ మొగ్గు చూపుతారు. బెట్టింగ్ కార్యకలాపాల పెరుగుదల, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ , బెట్టింగ్ సెక్టార్లో నిర్వహించే వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ కొనసాగుతున్న ఈ సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగించేందుకు ఔత్సాహికులు పోటీపడుతుంటారు. జరుగుతున్న లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వినియోగదారులు ఫాంటసీ లీగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త జట్లను ఏర్పాటు చేసి ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. బిజినెస్ ప్రమోషన్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది. టీవీలు, యాప్స్, లైవ్ స్ట్రీమ్‌లలో యూజర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని, సేవల ప్రచారానికి ఉపయోగిస్తుంటాయి. రెస్టారెంట్లు, బార్లపై ప్రభావం ప్రపంచ కప్ ఫైనల్‌ను ప్రదర్శించే రెస్టారెంట్లు, బార్లలో మ్యాచ్‌ను తిలకించేందుకు ఎగబడుతుంటారు. ఆ సమయంలో మద్యం, బిర్యానీతో పాటు ఇతర ఆహార వంటకాలు విపరీతంగా అమ్ముడు పోతుంటాయి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ వరల్డ్ కప్ ఫైనల్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈవెంట్ జరిగే సమయంలో భారీగా ఎత్తున నెటిజన్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా ఉపయోగిస్తుంటారు. మ్యాచ్ ఫలితాల్ని బట్టి మీమర్స్.. మీమ్స్ క్రియేట్ చేసి వారి వారి సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ మృతి తీరని లోటు
వ్యాపార వర్గాల నివాళి న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ మృతి పరిశ్రమకు తీరని లోటని భారత వ్యాపార, వాణిథ జ్య వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. 92 ఏళ్ల ముంజాల్ ఆదివారం సాయంత్రం మరణించారు. హీరో మోటో వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ గొప్ప గొప్ప సంస్థలను నిర్మించిన గొప్పవ్యక్తని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాళులర్పించారు. ముంజాల్ నాణ్యతకు, ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారని వాణిజ్యం, పరిశ్ర మల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికి సంబంధించిన అత్యంత ప్రముఖులైన వ్యక్తుల్లో ఆయన ఒకరని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. అంతర్జాతీయంగా భారత వాహన రంగానికి ఎనలేని ఖ్యాతిని ముంజాల్ ఆర్జించిపెట్టారని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి చెప్పారు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని కమాలియాలో 1923లో ముంజాల్ జన్మిం చారు. ముంజాల్ సోదరులు లూధియానాలో సైకిల్ విడిభాగాలు తయారు చేసే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. భారత్‌లో అతిపెద్ద వ్యాపార గ్రూప్‌గా హీరో మోటోకార్ప్ అవతరించడంలో ముంజాల్ ఇతోధికంగా కృషి చేశారు. 2005లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. -
పరిస్థితులు మెరుగుపడతాయ్
దావోస్: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడగలవన్న ఆశాభావంతో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు శనివారం ముగిసింది. అయిదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అసమానతలు, మధ్యప్రాచ్య సంక్షోభం, బాధ్యతాయుత పెట్టుబడిదారీ విధానం తదితర అంశాలపై ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు చర్చించారు. భారత్ సహా పలు దేశాల నుంచి మొత్తం 2,500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. భారత నేతలు దేశ వృద్ధిపైన, సంస్కరణల కొనసాగింపుపైన ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇన్వెస్టర్లు భారత్‌లో త్వరలో ఎన్నికల పరిణామాలపై ఆసక్తి కనపర్చారు. చివరి రోజున సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా భారత్ ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందని ప్రణాళిక సంఘం డిప్యుటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా స్పష్టం చేశారు.