వరల్డ్ కప్ ఫైనల్‌, దేశంలో బిజినెస్‌ అప్ & డౌన్

How The Icc World Cup 2023 Will Boost Various Indian Business Sectors - Sakshi

భారతీయ మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం

ఒక్క మ్యాచ్ చుట్టూ వందల కోట్ల వ్యాపారం

UPIలపై అసాధారణ ప్రభావం

మ్యాచ్ జరుగుతున్నంత సేపు అమ్మకాలు డల్

ప్రపంచకప్‌ ఫైనల్‌లో అహ్మాదాబాద్‌ వేదికగా భారత్‌- ఆస్ట్రేలియాలో హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ దిగిన భారత్‌ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. 

ఈ సందర్భంగా భారత్‌ - ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రభావం భారత్‌లోని పలు వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దేశంలో ఆయా రంగాలకు చెందిన వ్యాపార విభాగాలకు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వాటిల్లో    

యూపీఐ లావాదేవీలు డల్
మ్యాచ్‌ జరిగే సమయంలో యూపీఐ చెల్లింపులతో సహా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. జనమంతా మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉండడంతో.. UPI ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోతాయని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ల సందర్భంగా UPIలపై తీవ్రప్రభావం పడింది. కేవలం ఫుడ్‌ ఆర్డర్‌, హోటళ్ల బిజినెస్ మాత్రం జరిగింది. గత ఏడాది దీపావళి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు UPI లావాదేవీలు పూర్తిగా క్షీణించాయి. కింద ఇచ్చిన గ్రాఫ్ లో ఆ వివరాలను గమనించవచ్చు. ముఖ్యంగా కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు UPIలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత లావాదేవీలు సాధారణంగా మారాయి. 

అమ్మకాలలో హెచ్చుతగ్గులు
ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో ఆన్‌లైన్ విక్రయాలు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. టీమ్ జెర్సీలు, ఫ్లాగ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరగవచ్చు. మరోవైపు, ప్రజలు మ్యాచ్‌పై దృష్టి సారించడంతో క్రీడలకు సంబంధించిన ఆన్‌లైన్ విక్రయాలు భారీగా క్షీణించే అవకాశం ఉంది. 

బెట్టింగ్ యాప్‌లు
ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో బెట్టింగ్‌ యాప్స్‌ వినియోగం విపరీతంగా ఉంటుంది. మ్యాచ్ ఫలితం లేదా గేమ్‌లోని వివిధ ఈవెంట్‌లపై బెట్టింగ్‌పై ఎక్కువ మొగ్గు చూపుతారు. బెట్టింగ్ కార్యకలాపాల పెరుగుదల, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ , బెట్టింగ్ సెక్టార్‌లో నిర్వహించే వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. 

ఎంగేజ్‌మెంట్ 
వరల్డ్‌ కప్ ఫైనల్ కొనసాగుతున్న ఈ సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగించేందుకు ఔత్సాహికులు పోటీపడుతుంటారు. జరుగుతున్న లైవ్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వినియోగదారులు ఫాంటసీ లీగ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త జట్లను ఏర్పాటు చేసి ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. 

బిజినెస్‌ ప్రమోషన్స్‌ 
కంపెనీలు తమ ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ బాగా ఉపయోగపడుతుంది. టీవీలు, యాప్స్‌, లైవ్‌ స్ట్రీమ్‌లలో యూజర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల్ని, సేవల ప్రచారానికి ఉపయోగిస్తుంటాయి.  

రెస్టారెంట్‌లు, బార్‌లపై ప్రభావం 
ప్రపంచ కప్ ఫైనల్‌ను ప్రదర్శించే రెస్టారెంట్‌లు, బార్‌లలో మ్యాచ్‌ను తిలకించేందుకు ఎగబడుతుంటారు. ఆ సమయంలో మద్యం, బిర్యానీతో పాటు ఇతర ఆహార వంటకాలు విపరీతంగా అమ్ముడు పోతుంటాయి.   

సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ 
వరల్డ్ కప్ ఫైనల్ సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈవెంట్ జరిగే సమయంలో భారీగా ఎత్తున నెటిజన్లు ఒకరితో ఒకరు కనెక్ట్‌ అయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా ఉపయోగిస్తుంటారు.  మ్యాచ్‌ ఫలితాల్ని బట్టి మీమర్స్‌.. మీమ్స్‌ క్రియేట్‌ చేసి వారి వారి సోషల్‌ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top