సాక్షి, అమరావతి: ఏపీ డీఎస్సీ స్కామ్‌లో చంద్రబాబు సర్కార్ అడ్డంగా దొరికేసింది. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో గుట్టురట్టు అయ్యింది. పరీక్ష లేకుండానే ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసింది. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు కట్టబెట్టింది.
అయితే, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో రాత పరీక్ష పెట్టిన ప్రభుత్వం.. ఫిజికల్ టెస్టుతో పాటు రాత పరీక్షలోనూ అర్హత తప్పనిసరి చేసింది. జీవో 25 ప్రకారం రాత పరీక్ష తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ ఇచ్చింది. టీచర్ పోస్టులకు పరీక్ష లేకుండా.. కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీఎస్సీ స్కామ్‌కు ఇదే సాక్ష్యమని బాధిత అభ్యర్థులు అంటున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌లో గోల్‌మాల్!


