అమరావతి: ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌లో గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు బలపడ్డాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 24 గంటలు గడవకముందే ప్రభుత్వ నిర్ణయంలో మార్పు చేసింది.
జీవో 21 జారీ చేసింది కూటమి ప్రభుత్వం. పరీక్ష లేకుండానే మెరిట్ బేసిస్‌తో నియామకాలకు నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీకి ఇచ్చిన నియామక బాధ్యతలను వెనక్కి తీసుకుంది. జీవో 22తో నియామక ప్రక్రియను ఉపసంహరణ చేసుకుంది. పశుసంవర్థక శాఖ సెలక్షన్ కమిటీకి నియామక బాధ్యతలు అప్పగించింది. 24 గంటల‍్లోనే జీవోలు మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీపీఎస్సీ నుంచి నియామకాలను వెనక్కి తీసుకోవడం వెనుక గోల్‌మాల్ జరిగిందని తెలుస్తోంది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా వివాదాస్పద అధికారి దామోదర్‌ను కొనసాగేలా చేస్తోంది ప్రభుత్వం. టీడీపీ సానుభూతి అధికారిగా దామోదర్ నాయుడికి ముద్ర ఉంది. ఆయన చేతుల మీదుగానే ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పరీక్ష లేకుండా మెరిట్ పేరుతో నచ్చినవారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు.
ఇదీ చదవండి: ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


