ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YSRCP Chief YS Jagan Expresses Deep Shock Over Former Minister Alla Nanis Death | Sakshi
Sakshi News home page

ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Sep 15 2026 2:56 PM | Updated on Sep 15 2026 3:44 PM

 YS Jagan Expresses Deep Shock Over Former Minister Alla Nanis Demise

తాడేపల్లి: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అ‍న్నారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.  

కాగా, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) మంగళవారం విశాఖ నివాసంలో  గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత వైఎస్సార్‌సీపీ సర్కారులో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
ఆళ్ల నాని మృతి పట్ల YS జగన్‌ దిగ్భ్రాంతి 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement