కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్‌ ఎలా పనిచేస్తందో తెలుసా..! | Sakshi
Sakshi News home page

కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్‌ ఎలా పనిచేస్తందో తెలుసా..!

Published Sun, May 26 2024 3:13 PM

Unexpected Uses Of Toothpaste To Keep Your Kitchen Squeaky Clean

టూత్‌పేస్ట్‌ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్‌ సింక్‌లు, ట్యాప్‌లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను ‍క్లీన్‌ చేయడంలో టూత్‌పేస్ట్‌ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్‌ పేస్ట్‌ మన కిచెన్‌లో ఉన్న వస్తువులను క్లీన్‌గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! 

మన ఇంట్లో వేస్ట్‌గా మిగిలిపోయిన పాత పేస్ట్‌లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్‌ కారణంగా కొన్ని రకాల స్టీల్‌ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్‌పేస్ట్‌ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్‌ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..

స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్‌లు..
వంటగదిలోని సింక్‌ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్‌ పేస్ట్‌ భలే పనిచేస్తుంది. స్పాంజ్‌ సాయంతో కాస్త ప్రెజర్‌ ఉపయోగించి క్లీన్‌ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. 

కుళాయిలు..
నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్‌పేస్ట్‌ని పూసి క్లాత్‌తో క్లీన్‌ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. 

గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ స్టవ్‌లు..
గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ స్టవ్‌ టాప్‌లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్‌పేస్ట్‌ అద్భుతంగా పనిచేస్తుంది. 

మగ్స్‌పై కాఫీ, టీ మరకలు..
కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. 

కటింగ్‌ బోర్డ్‌..
కూరగాయలు కోసే కటింగ్‌ బోర్డ్‌లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్‌పేస్ట్‌ల్‌ ఉండే యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

(చదవండి: ఆమె క్రికెటర్స్‌ పాలిట దేవత..1983 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు కోసం..)

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement