మన పెంపుడు శునకం అదోలా ఉందేమిటి? దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఉందా? వంటగదిలో కత్తి టమోటాలు కోయడానికి కూడా మొరాయిస్తోందా? అయితే మీ కోసం వచ్చింది అత్యంత పదునైన వైబ్రేషన్ నైఫ్. స్మార్ట్ ఫ్రిడ్జ్‌తో ఉండే ఉపయోగాలేమిటో తెలుసుకోవాలని ఉందా?... ఇలాంటి ఎన్నో సరికొత్త సాంకేతిక పరికరాలకు లాస్‌వెగాస్‌లో జరిగిన సీయీఎస్ 2026 వేదిక అయింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వేదికలో ప్రదర్శితమైన స్మార్ట్ హోమ్ టెక్ గురించి...
1. మూగజీవి బాధలు తెలుసుకోవచ్చు
మన పెంపుడు శునకం శారీరక బాధలు, అనారోగ్య సమస్యలు మనకెలా తెలుస్తాయి? ఆ అరుపుల వల్ల ఏం అర్థమవుతుంది! ఇక చింత అవసరం లేదు. పెట్ టెక్నాలజీ కి ప్రసిద్ధి చెందిన ప్రముఖ పెట్ స్టార్టప్ ‘సాటెల్లై’ సరికొత్త స్మార్ట్ డాగ్ కాలర్‌ను రూపొందించింది. దీనికి ‘సాటెల్లై కాలర్ గో’ అని పేరు పెట్టారు.
ఈ పెట్‌సెన్స్ మానిటర్ లొకేషన్, నిద్ర, ఉష్ణోగ్రత వివరాలతో పాటు శునకం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఏదైనా అసాధారణంగా అనిపించినప్పుడు హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ కాలర్ జీపీఎస్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. పదిహేను రోజుల బ్యాటరీ లైఫ్ ఉండే ఈ కాలర్ వాటర్–రెసిస్టెంట్.
2. ఇది ఇస్మార్ట్ ఫ్రిజ్జ్
స్టోర్‌లలో కిరాణా సామాగ్రి ప్యాకెట్లను స్కాన్ చేయడం అనేది సాధారణ విషయమే కావచ్చు. మనం కొన్నవాటిని ఫ్రిజ్జ్‌లో పెట్టే ముందు స్కాన్ చేయాల్సి వస్తే? ఇకముందు సార్మ్ ఫ్రిడ్జ్‌లలోకి ఏ వస్తువైనా వెళ్లాలంటే ‘స్కానింగ్’ పరీక్ష పాస్ కావాల్సిందే! పోటీలో భాగంగా కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫ్రిడ్జ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాయి. జీయీ ప్రొఫైల్ న్యూ స్మార్ట్ ఫ్రిడ్జ్ దీనికి ఉదాహరణ. ఈ ఫ్రిడ్జ్ ద్వారా ఏ ఆహారపదార్థాలు త్వరగా పాడైపోతాయో తెలుసుకోవచ్చు.
ఫ్రిజ్జ్‌లోని వాటర్ డిస్పెన్సరీకి సమీపంలో బార్‌కోడ్ స్కానర్ అమర్చబడి ఉంటుంది. కాఫీ గింజలు, పాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ తరువాత అవి మన వీక్లి షాపింగ్ జాబితాలో చేర్చబడతాయి. దీనిని మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫ్రిడ్జ్‌లోని వినూత్నమైన ఫీచర్‌లలో టాప్–డౌన్ కెమెరా ఒకటి. దీనిద్వారా ప్రొడ్యూస్ డ్రాయర్స్‌ను ఎక్కడి నుంచైనా చూడవచ్చు. రెసిపీ జనరేటర్, హ్యాండ్స్–ఫ్రీ ఆటోఫిల్‌లాంటి ఫీచర్‌లు కూడా దీనిలో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫ్రిడ్జ్ బార్‌కోడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తుంది.
3. సూపర్ క్లీనింగ్
గత ఏడాది సీయీఎస్‌లో తమ ప్రొడక్ట్ ప్రైస్ జెడ్70 రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్’ను పరిచయం చేసింది రోబోరాక్ కంపెనీ. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో దారిలోని వస్తువులను పక్కకు పెట్టే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ సంవత్సరం మరో రోబోటిక్ వాక్యూమ్ వేరియంట్ ‘డ్రీమ్ ఎక్స్ 50 అల్ట్రా’ను పరిచయం చేసింది రోబోరాక్. మెట్ల పైకి, కిందికి కదలడానికి వీలుగా దీనికి కాళ్లు ఉంటాయి. మెట్లు ఎక్కుతూనే వాటిని శుభ్రం చేస్తుంది. మెట్లను వాక్యూమ్ చేస్తున్నప్పుడు ఒక కాలుని కింది మెట్టుపై ఉంచి 90 డిగ్రీలు తిరుగుతుంది.
4. ఆహా... అల్ట్రా షార్ప్ మానిటర్
మల్టిపుల్ మానిటర్స్ వల్ల ఉపయోగం ఉంటుందనేది కొత్త విషయమేమీ కాదు. సంవత్సరాల క్రితమే ఇది అనుభవంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్ని స్క్రీన్‌లు ఉన్నాయనేది ముఖ్యం కాదు... అధిక రిజల్యూషన్ పిక్సెల్స్ అనేదే ముఖ్యంగా మారింది. ప్రసిద్ధ డెల్ కంపెనీ అధిక రిజల్యూషన్ పిక్సెల్స్‌పై దృష్టి పెట్టింది.
డెల్ వారి అల్ట్రాషార్ప్ 52 థండర్‌బోల్డ్ మానిటర్ 6కే రిజల్యూషన్, 120 హెచ్ జడ్ రిఫ్రెష్‌రేట్‌తో కూడిన 52 అంగుళాల డిస్‌ప్లే. ఎక్కువ గంటలు పనిచేసే వారి కోసం, రెండు లేదా మూడు–మానిటర్‌ల సెటప్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని రూ΄÷ందించారు. ఇతర మానిటర్‌లతో ΄ోల్చితే 60 శాతం తక్కువ బ్లూ టైట్ కలిగి ఉంటుందని, కళ్లపై భారం పడదని కంపెనీ తెలియజేసింది. ‘ప్రపంచంలోనే తొలి 52–అంగుళాల అల్ట్రావైడ్ కర్వ్‌డ్ 6కే మానిటర్’గా ‘అల్ట్రా షార్ప్’ మానిటర్ గురించి ప్రకటించింది డెల్.
5. ఫస్ట్ అల్ట్రాసోనిక్ నైఫ్
చాలామంది ఇళ్లలో వంటగది కత్తులు అంత పదునుగా ఉండవు. సున్నితమైన టమోటాను కట్ చేయడానికి కూడా ఇబ్బంది పెట్టే కత్తులను చూస్తూ ఉంటాం. దీనికి కారణం కత్తిని ఎప్పటికప్పుడు పదును పెట్టక΄ోవడం. ఈ సమస్యను పరిష్కరించడానికి సియాటిల్ కంపెనీ అల్ట్రాసోనిక్స్ నైఫ్‌ను రూ΄÷ందించింది. ఇది ప్రపంచంలోనే తొలి అల్ట్రాసోనిక్ నైఫ్. ఈ కత్తి సెకన్‌కు 30,000 కంటే ఎక్కువసార్లు కంపిస్తుంది.
అత్యంత పదునుగా ఉండడమే కాదు ముక్కలు కత్తికి అంటుకోకుండా నిరోధిస్తుంది. ఈ నైఫ్‌ను ఉపయోగించడం చాలా సులభం. బ్లేడ్ హ్యాండిల్‌పై ఉన్న చిన్న బటన్‌ను నొక్కడం ద్వారా అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అల్ట్రాసోనిక్ నైఫ్ పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించడం సాధారణం. కానీ ‘అల్ట్రాసోనిక్ సి–200’ అనేది వంటగదిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేసిన నైఫ్.
6. ఇంటి చుట్టూ నిఘా
మీ ఇంట్లో స్మార్ట్ ల్యాంప్‌లు, స్మార్ట్ ప్లగ్‌లాంటివి ఉండవచ్చు. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు లైట్లు ఆన్ అయ్యే మోషన్ సెన్సర్ ఉండి ఉండవచ్చు. ఇలాంటి టెక్నాలజీని అఖారా వారి ఆల్–పర్పస్ ప్రెజెన్స్ సెన్సర్ ‘ఎఫ్‌పీ 400’ మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. ఇది ఉనికిని పసిగట్టే పరికరం. ఇంటి చుట్టూ కదలికలను ట్రాక్ చేసే మార్గం. వృద్ధులు పడి΄ోతే వెంటనే స్పందిస్తుంది.
ఈ సెన్సర్ ఇతర అఖారా పరికరాలతో మాత్రమే కాకుండా ఆపిల్ హోమ్, గూగుల్ హోమ్, అలెక్సాలాంటి ప్లాట్‌ఫామ్‌లతో కూడా లింక్ కాగలదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు సెన్సర్ నుండి వచ్చే హెచ్చరికలను అనుసరించి లైట్లను ఆన్ లేదా ఆఫ్ చేయడం, థర్మోస్టాట్‌లను సర్దుబాటు చేయడం...మొదలైనవి చేస్తాయి.
అఖారా వారి మరో స్మార్ట్‌హోమ్ గ్జాడ్జెట్... పీ 100. దీనికి ఎఫ్‌పీ 400తో పోల్చితే అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం లేనప్పటికీ సమీపంలోని కదలికలు, కంపనాలు, తలుపు తట్టడంలాంటి శబ్దాలు, డ్రాయర్‌లను తెరవడం, మూయడం... మొదలైన వాటిని పసిగట్టడానికి 9–యాక్సిస్ సెన్సింగ్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఆల్–ఇన్–వన్ సెక్యూరిటీ సెన్సర్‌లాంటిది. ‘ఆబ్జెక్ట్ స్టేటస్’ మోడ్, డోర్/విండో మోడ్‌లాంటి రకరకాల మోడ్‌లను సెట్ చేసుకోవచ్చు.
7. ఇంట్లోనే ప్లాస్టిక్ కంపోస్టర్
సాఫ్ట్ ప్లాస్టిక్‌ను రీసైకిలబుల్ బ్లాక్స్‌గా మార్చే ప్రపంచంలోని తొలి హోమ్ డివైజ్ ‘సాఫ్ట్ ప్లాస్టిక్ కం΄ోస్టర్’ను తీసుకువచ్చింది ‘క్లియర్ డ్రాప్’ స్టార్టప్. ఇది మధ్యలో ఒక స్లాట్ ఉన్న చెత్తడబ్బలాగా ఉంటుంది. దీనిలో సంచులు, గ్లోవ్స్‌లాంటి మెత్తని ప్లాస్టిక్ వస్తువులు వేయవచ్చు. ఈ బాక్స్‌లో తగినంత ప్లాస్టిక్ చేరినప్పుడు ఒక బటన్ నొక్కాలి. అప్పుడు కం΄ోస్టర్ లోపలి ప్లాస్టిక్‌ను వేడి చేసి, దానిని ఇటుక సైజ్‌లోకి మారుస్తుంది. ఆ తరువాత వీటిని ప్లాస్టిక్‌ను ప్రాసెస్ చేసే కేంద్రాలకు పంపవచ్చు. ఈ సాఫ్ట్ ప్లాస్టిక్ కంపోస్టర్ సీయిసి 2026 అవార్డ్ గెలుచుకుంది.
8. ఇక భయం లేదు... అలెర్జీ అలర్ట్ ఉందిగా!
ఫుడ్ అలెర్జీలు భయపెడతాయి. ఆ భయాన్ని తొలగించడానికి త్వరలో ‘అలెర్జిన్ అలర్ట్’ అనే మినీ, పోర్టబుల్ ల్యాబ్ మార్కెట్‌లోకి రానుంది. ఇది ఆహార నమూనాలను విశ్లేషించి నిమిషాల్లో ఫలితాలను అందిస్తుంది. అలెర్జీ హెచ్చరికలను ఇస్తుంది. ప్రస్తుతం హోటల్ చెఫ్‌లు ట్రయల్స్‌లో భాగంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అత్యుత్తమ స్టార్టప్ విభాగంలో ‘అలెర్జీన్ అలర్ట్’ విజేతగా నిలిచింది.
‘అలెర్జీన్ అలర్ట్’ అనేది బయోమెరియక్స్ కంపెనీ ప్రొడక్ట్. 1963 నుండి ఈ కంపెనీ క్లినికల్ మైక్రోబయాలజీ, అంటువ్యాధి పరీక్ష, ఆహార భద్రత... మొదలైన వాటికి సంబంధించి పనిచేస్తోంది. అలెర్జీ నిపుణులు, ఆహార భద్రతా నిపుణులతో కలిసి రూపొందించిన ఈ పరికరం ఫుడ్ అలెర్జీలు ఉన్నవారికి మాత్రమే కాకుండా రెస్టారెంట్లు, హోటల్స్, క్యాటరర్స్... ఇలా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. జేబులో సరిగ్గా సరిపోయే ‘అలెర్జీన్ అలర్ట్’ ఫుడ్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.
(చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)


