90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..! | NRIs video about the healthcare cost in America Goes Viral | Sakshi
Sakshi News home page

90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!

Jan 23 2026 5:43 PM | Updated on Jan 23 2026 6:24 PM

NRIs video about the healthcare cost in America Goes Viral

చాలామంది భారతీయ యువత డ్రీమ్‌ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్‌ అంటూ బాధపడుతున్నాడు. 

అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్‌ విజయ వర్గియాకు ఐస్‌ స్కేటింగ్‌ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్‌కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్‌లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్‌ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్‌. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. 

ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్‌ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్‌ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్‌ కొద్దిపాటి ట్రీట్‌మెంట్‌కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్‌ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్‌ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్‌ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. 

తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్‌ ఇన్సురెన్స్‌ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. 

 

(చదవండి: అందుకేనా జపాన్‌ అంత క్లీన్‌గా ఉంటోంది..!)



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement