అందుకేనా జపాన్‌ అంత క్లీన్‌గా ఉంటోంది..! | This Mindset Keeps Japan Clean Goes Viral | Sakshi
Sakshi News home page

అందుకేనా జపాన్‌ అంత క్లీన్‌గా ఉంటోంది..!

Jan 23 2026 3:43 PM | Updated on Jan 23 2026 4:32 PM

This Mindset Keeps Japan Clean Goes Viral

అత్యంత పరిశుభమైన దేశాల్లో ఒకటి జపాన్‌. చాలా పరిశుభ్రంగా ఉడే దేశాల్లో కూడా ఎక్కడో ఒక విషయంలో అధ్వాన్నంగా ఉంటుందేమో గానీ జపాన్‌ మాత్రం సూది మొనంత ధూళి కూడా కనిపించకుండా అందాల మెరిసిపోతుంది. అంత పరిశుభ్రంగానా అని అంతా ఆశ్యర్యపరిచేలా ఉంటుంది. అంతలా స్వచ్ఛత ఉండాలంటే..అక్కడ అందరిలో యూనిట్‌ కంటే..ఎలాంటి మనసతత్వం ఉంటే ఇది సాధ్యమైందో తెలిస్తే అవాక్కవుతారు. ఆ కారణం తెలుసుకున్నా..పాటించాలంటే కాస్త కష్టమే..!

జపాన్‌​ అంత శుభ్రంగా ఉండటానికి ఆ మానస్తత్వమే కారణమంటూ అక్కడ జరిగిన ఓ సంఘటను భారతీయ మహిళ ఊర్వశి రికార్డు చేసి మరి నెట్టింట షేర్‌ చేశారు. ఆమె షేర్‌ చేసిన వీడియోలో ఎవరో ఒక రెస్టారెంట్‌ వెలుపల వాంతులు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే అలాంటివి మనదేశంలో చాలా కామన్‌..సాయంత్ర దాక అది అలానే ఉంటుంది. రేపు రోడ్లు ఊడ్చేవాళ్లు వచ్చేదాక అంతే పరిస్థితి అన్నట్లు ఉంటుంది. 

కానీ జపాన్‌లో ఆ రెస్టారెంట్‌ సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఏ మాత్రం అసహ్యించుకోకుండా నేరుగా చేతులతోనే క్లీన్‌ చేయడం విశేషం. పైగా అతడి ముఖంలో ఎలాంటి చిరాకు, అసహ్యం కనిపించలేదు. ఏదో తన పని తాను చేసుకున్నట్లుగా చాలా నిశబ్దంగా క్లీన్‌ చేసి వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

ఆ వీడియోకి ఊర్వశి అక్కడ ధూళి కంటే మనస్తత్వం అత్యంత ముఖ్యం అనే క్యాప్షన్‌ జోడించి మరి నెట్టింట పోస్ట్‌ చేశారు. అక్కడ దాన్ని ప్రజా బాద్యతగా భావించి క్లీన్‌ చేస్తారు కాబట్టే జపాన్‌ అంత శుభ్రంగా ఉంటోంది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.  

 

(చదవండి: పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement