అక్కడ అందరికి ఒకే వంటగది. అందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యుల్లా భోంచేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి ఐక్యత ఎక్కడ కనిపించదు. కానీ ఈ గ్రామం ఐక్యమత్యం విలువ ఏంటో గొంతెత్తి చెబుతున్నట్లు ఉంటుంది. అక్కడ ఎవ్వరి నోట నుంచి ఒంటరితనం అనే మాట వినిపించదు. అంతలా వసుధైక కుటుంబంలా ఆదర్శవంతంగా నివశిస్తున్న గ్రామప్రజల జీవిన విధానం చూసి మోదీ సైతం మెచ్చుకున్నారు. అంతా ఒక్కమాటపై సమిష్టిగా ఉంటే ఏ బడ్జెట్ కేటాయింపులతో పని ఉండదు. కేవలం కలిసి ఉండాలన్న ఆ ఆలోచనే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిపోతుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. పైగా ఇతర గ్రామాలకు ఆదర్శం కూడా.
ఆ గ్రామమే గుజరాత్‌లోని చందకి గ్రామం. అక్కడ ఎవ్వరూ వంట చెయ్యరు. ఏ ఇంటిలోనే పొయ్యి వెలగదు. మరి భోజనం ఎలా అంటే..అక్కడ వాళ్లందరికీ కమ్యూనిట్ కిచ్‌న్ ఆధారం. అక్కడ సమిష్టిగా భోజనం తయారు చేసుకుని, అందరు కలిసి తింటారు. నిజానికి ఈ సంప్రదాయం ఐక్యత, సంరక్షణ, భాగస్వామ్య జీవనం వంటి విలువలను నేర్పించేలా ఉంది ఆ గ్రామస్తుల జీవన విధానం.
ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే..
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని చందాకి గ్రామంలో ఒకప్పుడు వెయ్యి మందికి పైగా నివాసితులు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 500 మంది పెద్దలు మాత్రమే ఉన్నారు. యువకులు చదువు, ఉద్యోగ రీత్యా అహ్మదాబాద్ వంటి నగరాలకు వెళ్‌లిపోయారు. కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దాంతో అక్కడ జనాభా తగ్గింది. చుట్టూ దుకాణాలు తగ్గాయి..రోజువారీ వంట వారికి ఓ పోరాటంలా మారింది. కనీస ప్రాథమిక అవసరాల కోసం కూడా ఏకంగా రూ. 3 కిలోమీటర్లు నడక తప్పేది కాదు. దాంతోపాటు ఒంటిరితనం ఆవరించడం మొదలైంది. ఎటుచూసినా ఇళ్లన్నీ.. నిశబ్దంగా ఉండటం మొదలయ్యాయి. ఇదంతా గమనించి ఆ ఊరి సర్పంచ్ పూనంభాయ్ పటేల్ దీనికి పరిష్కార మార్గం ఏంటని ఆలోచిస్తుండేదామె. న్యూయార్క్‌లో 20 ఏళ్లకు పైగా ఉన్న ఆమె తన స్వంతూరికి తిరిగి వచ్చి.. చాలా ఆలోచించి..ఓ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది.
గ్రామానికంతటికి ఒకే వంటగది ఉండేలా గ్రామ ప్రజలందర్నీ చైత్యనపరిచి మరి ఏర్పాటు చేశారామె. అక్కడున్న వారంతా నెలకు కేవలం రూ.2000 నుంచి రూ. 2500 వరకు చెల్లిస్తే చాలు..రెండు పూటల ఆరోగ్యకరమైన భోజనం రోటీలు, స్వీట్లు తినొచ్చు. సౌరశక్తితో నడిచే కిచెన్, ఎయిర్ కండిషన్ తదితర అత్యాధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ వంటగదిని ఏర్పాటు చేసుకున్నారు. అందరు కలిసి సమిష్టిగా వంటచేసుకుని మరి..భోజనం చేస్తారు.
ఇక నడవలేని దివ్యాంగులు, పెద్దలకు నేరుగా భోజనం ఇంటి వద్దకే అందిస్తారు. దీనివల్ల వారిలో తాము ఒంటరి అనే భావన కనుమరుగైంది. అందరూ ఆనందంగా ఆరోగ్యకరమైన భోజనం తింటూ సంతోషభరితంగా జీవిస్తూ..ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు అక్కడి ప్రజలు. ఆ గ్రామ జీవన విధానం ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. ఆయన తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో, దీని గురించి ప్రస్తావించి..అక్కడి కమ్యూనిటీ కిచెన్ సంప్రదాయన్ని మెచ్చుకున్నారు.
ఇది వంటభారాన్ని తగ్గించడమే కాకుండా సామాజిక బంధాలను బలోపేతం చేసింది. వసుధైక కుటుంబంలా జీవించేలా బలమైన కుటుంబ స్ఫూర్తిని అందించిందన్నారు. అంతేగాదు వాళ్లంతా కలిసి తినేలా ఒక విధానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు గంట మోగుతుంది. అది భోజన సమయం అయ్యింది అనేందుకు సంకేతం. అప్పుడు పెద్దలు గ్రామ ప్రవేశద్వారం సమీపంలో ఉన్న చంద్రేశ్వర్ మహాదేవ్ ఆలయంలో సమావేశమవుతారు. వెంటనే ఆ ఆలయ ప్రాంగణంలో టేబుళ్లు, కుర్చీలు క్షణాల్లో సిద్ధమవుతాయి. అంతా హాయిగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేస్తారు. వడ్డన కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుందట.
#DidYouKnow in #Gujarat's Chandanki village, food isn't cooked in individual homes? Instead, the entire village shares meals in a community kitchen. This initiative fosters community and senior care, crucial for the well-being of residents.@GujaratTourism pic.twitter.com/Xzy1LPWVNm
— Dhanraj Nathwani (@DhanrajNathwani) March 10, 2024
(చదవండి: ఒంటరి పెంగ్విన్ ఇంత స్ఫూర్తిని రగిలించిందా?!)


