వంటిట్లోని స్క్రబ్బర్‌, స్పాంజ్‌లతో ముప్పు : టాయిలెట్‌ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా | kitchen sponge can cause kidney failure check details | Sakshi
Sakshi News home page

వంటిట్లోని స్క్రబ్బర్‌, స్పాంజ్‌లతో ముప్పు : టాయిలెట్‌ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా

Sep 14 2024 4:08 PM | Updated on Sep 14 2024 4:46 PM

kitchen sponge can cause kidney failure check details

వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి.  ఏ మాత్రం  తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్‌ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్‌ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. 

ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు  ఎక్కువగా స్టీల్‌ స్క్రబ్బర్‌ని, లేదా స్పాంజ్‌ని వాడుతూ ఉంటాం కదా. ఈ  డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్‌స్పాట్‌  అంటే నమ్ముతారా?  ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని  తాజా స్టడీ తేల్చింది. 

కిచెన్ స్పాంజ్‌లు ఎందుకు ప్రమాదకరం?
డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్‌లు  తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు.  ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్‌లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్‌ పాయిజిన్‌లాంటి  తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్‌తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.  వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. 

అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్‌లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా  ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్‌లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. 


పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. 

  • పాత్రలను శుభ్రం చేసే  స్పాంజ్‌లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్‌ చేయాలి.  తడి లేకుండా బాగా పిండేసి,  తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. 

  • మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి  వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి.  

  • బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్‌లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచాలి.

  • డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్‌లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు.
     

స్పాంజ్‌లకు ప్రత్యామ్నాయాలు
ప్లాస్టిక్ స్పాంజ్‌లను తరచుగా వాడి పారేయడం  పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్‌ లాంటి  ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్‌లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు,  స్క్రబ్ బ్రష్‌లు, సిలికాన్ బ్రష్‌లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్‌వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement