మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..! | What is the Inner Critic And How To Overcome | Sakshi
Sakshi News home page

The Inner Critic: మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!

Feb 27 2026 7:10 AM | Updated on Feb 27 2026 7:10 AM

What is the Inner Critic And How To Overcome

మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు, "ఇది నీవల్ల కాదులే", "అందరూ చూసి నవ్వుతారు", "గతంలో కూడా ఇలాగే ఫెయిల్ అయ్యావుగా" అని మీ లోపల ఒక గొంతు వినిపిస్తుందా? ఆ గొంతుకనే సైకాలజీలో 'The Inner Critic' అంటారు. ఈ శత్రువు బయట ఎక్కడో లేడు, మీ మెదడులోనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం వెనక్కి లాగుతుంటాడు.

ఈ 'ఇన్నర్ క్రిటిక్' ఎక్కడి నుండి వస్తుంది?
మనం పుట్టినప్పుడు ఈ విమర్శించే స్వభావంతో పుట్టము. మన చిన్నతనంలో మనపై ప్రభావం చూపిన వ్యక్తుల మాటలే మనకు పెద్దయ్యాక ఈ లోపలి గొంతుకగా మారతాయి.

కండిషనింగ్: చిన్నప్పుడు మిమ్మల్ని అతిగా విమర్శించిన తల్లిదండ్రులు, టీచర్లు లేదా బంధువుల మాటలు మీ సబ్-కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతాయి.

సర్వైవల్ మెకానిజం: మన మెదడు మనల్ని ప్రమాదాల నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఏదైనా కొత్త పని చేసినప్పుడు అవమానం జరుగుతుందేమో అన్న భయంతో, ఆ మెదడు ఈ 'ఇన్నర్ క్రిటిక్'ను వాడి మిమ్మల్ని ఆపేస్తుంది.

ఇన్నర్ క్రిటిక్ రకాలు: మీది ఏ రకం?
సైకాలజిస్ట్ Jay Earley ప్రకారం, ఈ అంతర్గత విమర్శకుడు రకరకాలుగా ఉంటాడు:

The Perfectionist: "ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలి, లేకపోతే అసలు చేయకు" అని ఒత్తిడి తెస్తాడు.

The Taskmaster: "నువ్వు ఇంకా కష్టపడాలి, విశ్రాంతి తీసుకోవడం తప్పు" అని వేధిస్తుంటాడు.

The Destroyer: "నువ్వు పుట్టడమే ఒక తప్పు, నువ్వు దేనికీ పనికిరావు" అని మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాడు.

అణచివేస్తే అణిగిపోదు
"నీ లోపలి గొంతును అణచివేయి, దాన్ని చంపేయ్" అని ట్రైనర్స్ చెప్తారు. కానీ సైకాలజీ ప్రకారం, మీరు దేన్నైతే అణచివేయాలని చూస్తారో, అది ఇంకా బలంగా తయారవుతుంది.

మార్కెట్ విమర్శను ద్వేషించమంటుంది. సైకాలజీ ఆ గొంతు వెనుక ఉన్న 'భయాన్ని' అర్థం చేసుకోమంటుంది.

విమర్శకుడిని స్నేహితుడిగా మార్చుకోండి
Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ గొంతును ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం.

Step 1: గుర్తించి పేరు పెట్టండి
ఆ నెగటివ్ ఆలోచనలు రాగానే, అవి "మీవి" కాదని గుర్తించండి. "నేను ఫెయిల్ అవుతాను" అనడానికి బదులు, "నా లోపల ఉన్న విమర్శకుడు నేను ఫెయిల్ అవుతానని భయపడుతున్నాడు" అని అనండి. వీలైతే ఆ గొంతుకు ఒక పేరు పెట్టండి. ఉదాహరణకు: 'మిస్టర్ డౌట్'.

దీనివల్ల ఆ గొంతుకు, మీ అసలు వ్యక్తిత్వానికి మధ్య ఒక దూరం ఏర్పడుతుంది (Cognitive Defusion). ఇదే పాత అలవాటును 'Break' చేయడం.

Step 2: సెల్ఫ్-కంపాషన్
మీ ప్రాణ మిత్రుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు అతన్ని ఎలా ఓదారుస్తారో, మిమ్మల్ని మీరు అలాగే ఓదార్చుకోండి.

"పర్లేదు, తప్పులు అందరూ చేస్తారు, మళ్ళీ ప్రయత్నిద్దాం" అని మీతో మీరు మాట్లాడుకోండి. ఒక సపోర్టివ్ ఇన్నర్ వాయిస్‌ని 'Build' చేయండి.

Step 3: పర్పస్ డ్రైవెన్ లైఫ్
మీరు ఒక పెద్ద లక్ష్యం (Legacy) కోసం పని చేస్తున్నప్పుడు, ఈ చిన్న చిన్న విమర్శలు మీకు వినిపించవు. మీ లోపలి విమర్శకుడు చెప్పేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే, అది వాస్తవం కాదు అని తెలిసినప్పుడు మీరు 'Beyond' స్టేజ్‌లో ఉన్నట్లు.

ఈ రోజు మీ విమర్శకుడు ఏం చెప్పాడు?
ఒక పెన్ను, పేపర్ తీసుకోండి, ఈ ప్రశ్నలకు సమాధానం రాయండి. 

ఈ రోజు మీ గురించి మీరు అనుకున్న ఒక నెగటివ్ మాట ఏంటి?
ఆ మాట వెనుక ఉన్న భయం ఏంటి? ఉదా: నలుగురు ఏమనుకుంటారో అన్న భయమా?
అదే మాట మీ మిత్రుడు తన గురించి తాను అంటే, మీరు అతనికి ఏం సమాధానం చెప్తారు? 
ఆ సమాధానాన్నే మీకు మీరు చెప్పుకోండి.

మీకు మీరే అతిపెద్ద సపోర్టర్ అవ్వాలి!
బ్రో, ప్రపంచం మిమ్మల్ని విమర్శించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కనీసం మీ తల లోపల అయినా మీరు మీ వైపు ఉండాలి.

మీ 'ఇన్నర్ క్రిటిక్'ను ఒక కఠినమైన యజమానిలా కాకుండా, మీ క్షేమం కోరే ఒక భయపడిన పిల్లాడిలా చూడండి. అతనికి ధైర్యం చెప్పి ముందుకు సాగండి.

గుర్తుంచుకోండి, "You have been criticizing yourself for years and it hasn’t worked. Try approving of yourself and see what happens."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా మెరుగుపరుచుకోవాలి..?)
 

Advertisement
 
Advertisement
Advertisement