వైరల్‌.. మృగరాజుకి ఆకలేసి కిచెన్‌లో దూరింది! | Lion Enters House Through Roof in gujarat Kovaya Village | Sakshi
Sakshi News home page

గాఢనిద్రలో కుటుంబం.. రెండు గంటల పాటు కిచెన్‌లో సింహం కలకలం!

Apr 4 2025 2:06 PM | Updated on Apr 4 2025 3:15 PM

Lion Enters House Through Roof in gujarat Kovaya Village

గాంధీనగర్‌ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అ‍మ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్‌గా కిచెన్‌లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. 

గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో  బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు.  ఆ సమయంలో ఓ  సింహం వారి కిచెన్‌లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.

అయితే  అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్‌ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. ‍కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు.   కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్‌ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్‌ఫోన్‌లలో బంధించడం మనం చూడొచ్చు.  

సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు.  ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement