భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్త | Incident in Nizamabad district | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్త

Aug 9 2026 6:20 AM | Updated on Aug 9 2026 6:21 AM

Incident in Nizamabad district

పక్కింటికి కూడా వ్యాపించిన మంటలు

నవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్‌పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్‌ఏ) అల్లం సురేశ్‌ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్‌.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే  మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు.

అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్‌.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్‌ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement