అంతరిక్షంలో వరి సాగు | China Harvests First Rice Samples Grown from Space Seeds | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో వరి సాగు

Aug 9 2026 5:56 AM | Updated on Aug 9 2026 5:56 AM

China Harvests First Rice Samples Grown from Space Seeds

స్పేస్‌ స్టేషన్‌లో ప్రయోగం చైనా విజయకేతనం.. 

చంద్రుడు, అంగారకుడిపైకి జరిగే యాత్రల్లో సంపూర్ణ స్వయంసమృద్ధికి కొత్త బాట

రోదసీ పరిశోధనల్లో మానవాళి మరొక చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా ‘తియాంగాంగ్‌’ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు వరి పంటను తొలిసారి విజయవంతంగా పండించారు. విత్తనం వేసి ధాన్యాన్ని నూర్చే వరకు జీవిత చక్రాన్ని పూర్తి చేసి ప్రతిష్టాత్మక మైలురాయిని దాటారు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం నివసించే రోదసీ యాత్రికులకు స్వయంసమృద్ధిగల ఆహార భద్రతను అందించే ప్రయత్నాల్లో ఈ ప్రయోగం విప్లవాత్మక మలుపుగా నిలిచింది.

అంతరిక్ష కాలనీలకు మార్గం
ఈ సంచలన ప్రయోగం ద్వారా రోదసీలోనే ఆహారాన్ని పండించటం మాత్రమే కాకుండా, వ్యోమగాములు విడుదల చేసే కార్బన్‌ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయటానికి కూడా అవకాశం దొరికింది. నీటి వ్యవస్థను సహజ సిద్ధంగా శుద్ధి చేయటం కూడా సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ‘క్లోజ్డ్‌–లూప్‌ ఎకోసిస్టమ్‌’ రూపుదిద్దుకో వడానికి ఇది ప్రాథమిక అడుగు.

భవిష్యత్తులో మార్స్‌ లేదా చంద్రుడిపై కాలనీలు నిర్మించే క్రమంలో భూమి నుంచి ప్రతీసారీ ఆహారాన్ని మోసుకెళ్లే అవసరం లేకుండా, అక్కడే స్వయంగా పంటలు పండించుకునేందుకు ఇక మీదట 100 శాతం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ అంతరిక్ష వరి విత్తనాల్లోని జన్యుపరమైన మార్పులను అధ్యయనం చేయటం ద్వారా భూమిపై తీవ్ర ప్రతికూల వాతావరణ మార్పులను ఎదుర్కొనే నూతన వరి రకాలను అభివృద్ధి చేయటానికి 
కూడా ఈ పరిశోధన దోహదపడుతుందని చెబుతున్నారు.

ఎల్‌ఈడీ కాంతి, ద్రవ పోషకాలు..
భూమిపై గురుత్వాకర్షణ ప్రభావంతో మొక్కల వేళ్లు కిందికి, కాండం పైకి పెరుగుతాయి. అయితే, రోదసీలోని మైక్రోగ్రావిటీ (శూన్య గురుత్వాకర్షణ శక్తి)లో వాతావరణంలో మొక్కల పెరుగుదల శైలి మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష ఇంక్యుబేటర్లలో ప్రత్యేక ఎల్‌ఈడీ కాంతి, ద్రవ పోషకాల ద్వారా నీరు, ఎరువుల వరి పంట పండించారు. ఈ ప్రయోగంలో పొడవు రకం వరి మొక్కలు అనుకున్న దానికంటే ఆలస్యంగా ధాన్యాన్ని పండించగా, పొట్టి రకం మొక్కలు సరైన సమయంలోనే పండాయి.

అంతరిక్ష వరి సాగు ముఖ్యాంశాలు
అంతరిక్ష కేంద్రం: చైనా తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌
సాగు చేసిన పంట: వరి (పొడవు, పొట్టి రకాలు)
ప్రయోగ కాలం: 120 రోజులు 
మైలురాయి: శూన్య గురుత్వా కర్షణలో ‘నారు నుంచి నూర్పిడి వరకు’ ప్రయోగం విజయవంతం
ముఖ్య ప్రయోజనాలు: రోదసీలో ఆహారోత్పత్తి, ఆక్సిజన్‌ పునరుత్పత్తి, నీటి శుద్ధి వ్యవస్థల అనుసంధానం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement