
ఎయిర్ ఫ్రై నుంచి డీప్ ఫ్రై వరకు స్వయంగా వంట చేసుకుంటున్న మగాళ్లు
కుక్‌వేర్ మార్కెట్‌కు కొత్త జోష్
బ్రాండెడ్ కుక్‌వేర్‌కి పెరుగుతున్న డిమాండ్
ముంబైలోని చిన్న వంటగదిలో 29 ఏళ్ల జస్టిన్ వారంలో ఒక రాత్రి తన ఎయిర్ ఫ్రయర్‌లో స్వీట్ పోటాటో వెజెస్ వేయిస్తూ, సలాడ్ సిద్ధం చేస్తుంటాడు. వంట అనేది అతనికి విసుగెత్తించే పనికాదు, రిలాక్స్ అవడానికి, స్నేహితులను ఎంటర్‌టైన్ చేయడానికి, కొత్త రుచులను అన్వేíÙంచడానికి అదో మార్గం. జస్టిన్ ఇప్పుడు భారతదేశ నగరాల్లో పెరుగుతున్న ఒక వర్గానికి ప్రతినిధి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పురుషులు స్టైలిష్ గాడ్జెట్లు, ఆధునిక కుక్‌వేర్‌తో వంటింట్లోకి అడుగుపెడుతున్నారు. ఇది మారుతున్న అలవాట్లకే కాదు వాణిజ్యపరంగా కూడా ఒక విప్లవం.
దృక్పథం మారుతోంది...
ఆన్‌లైన్లో వంటింటి సామాను కొనేవారిలో ఇపుడు 30% మంది పురుషులే ఉంటున్నారు ఐదారేళ్ల క్రితం ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. ఇంట్లో వంటగది ఎలా ఉండాలి, కుకింగ్ త్వరగా అయేందుకు ఏమేం వస్తువులు కొనాలి అనే నిర్ణయాన్నిఇపుడు అనేక ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకుంటున్నారని స్టాల్ కిచెన్స్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు.వంటింటి సామ్రాజ్యానికి ఇప్పటికీ మహిళలే మహారాణులైనా పురుషుల వాటాకూడా క్రమంగా పెరుగుతోందని వండర్ చెఫ్ వ్యవస్థాపకుడు రవి సక్సేనా స్పష్టంచేశారు.
70% వారానికోసారి...
ఆన్‌లైన్ కొనుగోళ్ల ఆల్గరిథమ్‌ను పరిశీలిస్తే వంటింటి సామాను కొనే పురుషులు రెండు రకాలని తెలుస్తోంది. మొదటిరకం.. స్వతంత్రంగా జీవించే యువకులు వీరు రోజువారీ వాడుకకు పనికివచ్చే, నాన్–టాక్సిక్ కుక్‌వేర్, ఒకటి రెండు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఇక రెండో రకం ప్యాషనేట్ కుక్స్ (బిజీ ప్రొఫెషనల్స్) వీరు ప్రతిరోజూ వంట చేయకపోయినా, ప్రీమియం సెట్‌లు కొనుగోలు చేసి సంప్రదాయ కుటుంబ వంటకాలతోపాటు రెస్టారెంట్‌లో లభించే రుచులను వంటింట్లో తయారుచేసేందుకు ప్రయతి్నస్తారు.
కుక్‌వేర్ కొనే పురుషుల్లో 70% మంది కనీసం వారానికి ఒకసారి వాటిని వాడతారు. వీరు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులు, పూర్తి సెట్‌లను కొనడానికి ఇష్టపడతారు. వీరి సగటు ఆర్డర్ విలువ ఇతరులతో పోలిస్తే 12% ఎక్కువని ఎంబర్ కుక్‌వేర్ సీఈఓ సిద్ధార్థ్ గడోదియా చెప్పారు. పురుషులకు బాగా నచ్చేవి, ఎక్కువగా కొనే కిచెన్ ఉత్పత్తులు మలీ్ట–ఫంక్షనల్ పరికరాలు (కలపడం, ముద్ద చేయడం, కట్ చేయడం, ఆవిరి వేయడం, వండడం ఇలా ఆల్ రౌండర్ టైపువి. స్టీలు పెనాలు, మూకుళ్లు ఉంటాయని గడోదియా తెలిపారు. మొత్తానికి, పురుషులు వంటింట్లోకి అడుగుపెట్టడం వల్ల కుక్‌వేర్ మార్కెట్‌కి కొత్త కళ వచి్చంది.
పురుషులు వంటగదిలోకి రావడానికి కారణాలు
→ ఆరోగ్యంపై శ్రద్ధ (తక్కువ నూనె, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించడం)
→ ఫ్లెక్సిబుల్ వర్క్ ప్యాటర్న్స్ (హోమ్ ఆఫీస్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్)
→ సోషల్ మీడియాలో నోరూరిస్తూ లభించే సులభమైన రెసిపీలు