
డిసెంబర్ 31 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం పొడిగించింది. ఆగస్టులో మొదలుపెట్టిన మలి విడతలో మ్యాన్–మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) దుస్తులు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్‌టైల్స్ సహా వివిధ విభాగాల నుంచి దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
పరిశ్రమలో గణనీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ స్కీములో పాల్గొనేందుకు భావి ఇన్వెస్టర్లకు మరో అవకాశం కలి్పస్తున్నట్లు టెక్స్‌టైల్స్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జౌళి పరిశ్రమ వృద్ధికి తోడ్పడటం, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడం లక్ష్యంగా 2021 సెపె్టంబర్ 24న ప్రభుత్వం ఈ స్కీమును ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 28,711 కోట్ల పెట్టుబడుల హామీలతో 74 సంస్థలు ఎంపికయ్యాయి.