దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మాదిరిగానే.. బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 92.45 పాయింట్ల నష్టంతో.. 84,970.90 వద్ద, నిఫ్టీ 35.15 పాయింట్ల నష్టంతో 26,143.55 వద్ద నిలిచాయి.
జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్, ఎన్ఐబిఎల్ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరి లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఓరియంట్ సెరాటెక్ లిమిటెడ్, ఇన్‌క్రెడిబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


