
మోడ్రన్ కిచెన్‌ను ప్రారంభిస్తున్న నమ్రత
బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్‌ను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కెఎల్.నారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ కిచెన్‌ను పూర్తి ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడ సౌకర్యాలపై నమ్రతా శిరోద్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ ఉపాధ్యక్షుడు ముళ్లపూడి మోహన్, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ, సుష్మ పాల్గొన్నారు.