స్టీలు సామాన్లు కొత్తవాటిలా మెరవాలంటే..! | Kitchen Tips: How to Clean Steel Utensils Effectively | Sakshi
Sakshi News home page

స్టీలు పాత్రలు, వెండిసామాన్లు కొత్త వాటిలా అందంగా వెరవాలంటే..!

Jun 25 2025 4:35 PM | Updated on Jun 25 2025 6:09 PM

Kitchen Tips: How to Clean Steel Utensils Effectively

వంటింట్లో పనిచేసే ఇంతులకు తరుచుగా కొన్ని సమస్యలు ఎదురవ్వుతుంటాయి. వంటి సామాన్ల దగ్గర నుంచి డ్రెస్సింగ్‌ టేబుల్స్‌ వరకు అన్నింటిని పరిశుభ్రంగా ఉంచడం తలొనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అవి అందంగా మెరిపించడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఏం చేయాలో పాలుపోక తెగ ఇబ్బంది పడుతుంటాం.  అలాంటి వారికి ఈ సింపుల్‌ ఈ కిచెన్‌ టిప్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో చూద్దామా..!.

స్టీల్‌ పాత్రలు వెలిసిపోయి మూతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్‌పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీలు పాత్రకు రాసి టూత్‌ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతాపోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. 

మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను సమపాళ్లల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరువాత మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్‌లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. 

డ్రెస్సింగ్‌ టేబుల్‌ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. 

ఒక కప్పు బేకింగ్ సోడాని సింక్‌లో చల్లండి. వెంటనే అర కప్పు వెనిగర్ వేయండి. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. ఈ కాంబినేషన్ మురికిని తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఆ తరువాత వేడి నీళ్లతో క్లీన్ చేయండి. సింక్ దుర్వాసన పూర్తిగా పోతుంది.
 

(చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్‌ తప్పనిసరి..!)
 

Advertisement
 
Advertisement
Advertisement