
‘ఫిగర్ ఏఐ’ అనేది హ్యూమన్ రోబోలకు సంబంధించిన స్టార్టప్. తాజాగా ‘ఫిగర్ వో 3’ అనే హ్యూమన్ రోబో గురించి ప్రకటించింది కంపెనీ. ‘రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సాధారణ హ్యూమనాయిడ్ రోబో ఇది. గదిని శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, ఆహారాన్ని వడ్డించడం, గిన్నెలు కడగడం, బట్టలు మడత పెట్టడం...మొదలైన ఎన్నో పనులు చేస్తుంది’ అని ‘ఫిగర్ వో 3’ వివరాలు వెల్లడి చేసింది కంపెనీ.
కాలిఫోర్నియాకు చెందిన ‘ఫిగర్ ఏఐ’ స్టార్టప్ మునుపటి తరం హ్యూమనాయిడ్‌లతో పోల్చితే సరికొత్త, సాంకేతికంగా ఒక అడుగు ముందుండే హ్యూమనాయిడ్స్ దృష్టి పెట్టింది. పూర్తిగా రీడిజైన్ చేసిన సెన్సరీ సూట్, హ్యాండ్ సిస్టమ్, నెక్ట్స్ జనరేషన్ విజన్ సిస్టమ్‌తో ఈ సరికొత్త హ్యూమనాయిడ్ రోబో మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది.
(చదవండి: పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!)