
కిచెన్ షో
వంటింటికి అవసరమైన సామగ్రి అంతా ఒకేచోట కొలువుదీరింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ఇండియాస్ బిగ్గెస్ట్ కిచెన్ షో ఇందుకు వేదికైంది.
వంటింటికి అవసరమైన సామగ్రి అంతా ఒకేచోట కొలువుదీరింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ఇండియాస్ బిగ్గెస్ట్ కిచెన్ షో ఇందుకు వేదికైంది. ఆదివారం వరకు జరగనున్న ఈ షోలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటుచేశారు. 70కి పైగా బ్రాండ్‌లు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహించిన ఈ కిచెన్ షోలో చిన్న కంపెనీల దగ్గరి నుంచి ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
వంటగదిలో అవసరమయ్యే టీ గ్లాస్ నుంచి ప్రతి వస్తువు అందుబాటులో ఉంది. నూనె లేకుండానే వండుకొనే ఇటలీకి చెందిన జీపిటర్ పాత్రలు, లక్ష రూపాయల విలువ చేసే హ్యాండ్ మేడ్ సిల్వర్ కుక్కర్ ఆకట్టుకుంటోంది. ఇవికాకుండా సూపర్ చైర్ ప్రధాన ఆకర్షణ. శరీర కదలికలను బట్టి ఈ చైర్ అడ్జస్ట్ అవుతుంది. ఈ ఇటలీ చైర్ మరో రెండు వారాల్లో సిటీ మార్కెట్‌లోకి రానుంది.
సాక్షి, సిటీప్లస్