కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి! | Sakshi
Sakshi News home page

కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!

Published Mon, Feb 19 2024 11:52 AM

What Alternatives Rising Garlic Prices Impact Kitchen Budgets - Sakshi

దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్‌ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే..

సింపుల్‌ చిట్కాలు..

  • ముందుగా మీ కిచెన్‌ కప్‌బోర్డ్‌లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం.
  • అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. 
  • అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్‌ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. 

ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. 

(చదవండి: ళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్‌ ఉంటే చాలు!)

Advertisement
 
Advertisement