ఖాళీ దొరికితే ... | sonakshi sinha on kitchen | Sakshi
Sakshi News home page

ఖాళీ దొరికితే ...

Jun 9 2018 12:33 AM | Updated on Apr 3 2019 6:34 PM

sonakshi sinha on kitchen - Sakshi

సోనాక్షి సిన్హా

రీసెంట్‌గా ‘హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగీ’ సినిమా కోసం మినీ ట్రక్‌ స్టీరింగ్‌ తిప్పిన బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ఇప్పుడు కిచెన్‌లోకి వెళ్లి గరిటె  తిప్పారు. ఎగ్‌ కర్రీ వండారు సోనాక్షి. ఇప్పుడైతే ఈ వంటకం చేశారు కానీ గతంలో ఏదో స్వీట్‌ ఐటమ్‌ ట్రై చేశారట. ఖాళీ దొరికినప్పుడల్లా డిఫరెంట్‌ వంటకాలను ట్రై చేయడం సోనాక్షి అలవాటు. ఇక... సోనాక్షి చేస్తున్న ‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ’ సినిమా విషయానికొస్తే... రెండేళ్ల క్రితం వచ్చిన ‘హ్యాపీ భాగ్‌ జాయేగీ’ సినిమాకి సీక్వెల్‌ ఇది. ఇందులో సోనాక్షి సిన్హా, డయానా పెంటీ, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్, అభయ్‌ డియోల్‌ నటిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement