
వంటిల్లు మన మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే వంటిల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉండేలా జాగ్రత్త పడాలి. గిన్నెలను కడిగిన తరువాత శుభ్రంగా ఆరనివ్వాలి. వంటఇంట్లో వాడే తువ్వాలు దగ్గర్నుంచీ వంట దినుసులు దాకా అన్నీ ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవాలి. మరి టిప్ ఆప్ ది డేలో భాగంగా వంటిట్లో బొద్దింకలను నివారించాలంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలో పాటించాలో తెలుసుకుందాం.
వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి.అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి.
వీటితో పాటు సింక్‌లో ఎంగిలి గిన్నెలను అలా వదిలి వేయకూడదు. ఎప్పటికపుడు పాత్రలను కడిగేసుకోవాలి.
ప్రతీ ఏడాదికి ఒకసారి తీవ్రతను బట్టి పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి. ఈ సమయంలో, పిల్లలు, పెడ్ యానిమల్స్‌తో జాగ్రత్తగా చూసుకోవాలి.
వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.
ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.
అవసరం లేని అట్ట పెట్టెలపై వంట ఇంట్లో ఉంచుకోవద్దు. వీటిల్లో చెక్క గుజ్జు బొద్దింకలకు అద్భుతమైన ఆహారం. వాటికి మంచి ఆవాసం కూడా.
బొద్దింకలు కొన్ని వాసనలను ద్వేషిస్తాయి, ఉదాహరణకు: నిమ్మ, యూకలిప్టస్, లావెండర్, పుదీనా, వేప నూనెలు. ఈ నూనెలను స్ప్రే చేయడం లేదా వాటిని ఇంటి చుట్టూ ఉంచడం వల్ల బొద్దింకలను దూరం చేయవచ్చు,
బేకింగ్ సోడా, చక్కెరను సమాన నిష్పత్తిలో కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాలలో ఉంచుకోవచ్చు..
బోరిక్ యాసిడ్ , మైదా కలిపి మాత్రలు చేసి బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో ఉంచడం కూడా మంచిది.
వెనిగర్ తో ఇంటిని శుభ్రం చేయడం వల్ల బొద్దింకలు రాకుండా ఉంటాయి.