రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు! | Thank You For Free Publicity Abhijeet Dipke On Cockroach Effigy | Sakshi
Sakshi News home page

రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!

Oct 21 2026 8:16 AM | Updated on Oct 21 2026 8:16 AM

Thank You For Free Publicity Abhijeet Dipke On Cockroach Effigy

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపురలో జరిగిన దసరా వేడుకలు రాజకీయ దుమారానికి వేదికగా నిలిచాయి. శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ ప్లేస్ గ్రౌండ్‌లో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేశారు. సంప్రదాయ రాక్షస రూపాల మధ్యలో ఈ విచిత్ర రూపం చేరడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ చర్య స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ ప్రచారంలో భాగమేనని రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ దేవర్హా వివరణ ఇచ్చారు.

అపరిశుభ్రత, ఆస్తమా, అలర్జీల వంటి వ్యాధులకు ప్రతీకగా మాత్రమే బొద్దింకను తగులబెట్టామని, దీనికి ఎవరితోనూ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే బీజేపీ అగ్రనేతలు, మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడంతో ఇది కేవలం పరిశుభ్రత అవగాహన మాత్రమే కాదనే చర్చ మొదలైంది. ఈ పరిణామంపై ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలతో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)చీఫ్ అభిజీత్ దిప్కే ఘాటుగా స్పందించారు. తమ ప్రెజర్ గ్రూప్‌ను ఉద్దేశించే అధికార పార్టీ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ‘మాకు ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన వ్యంగ్యంగా ‘ఎ‍క్స్‌’లో పోస్ట్ పెట్టారు.

సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ స్పందిస్తూ, అధికార పార్టీ తమ ఎదుగుదలను చూసి ఎంత భయపడుతోందో ఈ ఘటన నిరూపిస్తోందని అన్నారు. పీస్ బాండ్ ఉల్లంఘన కేసులో పార్టీ ముఖ్య ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా జైల్లో ఉండటం వంటి ఉద్రిక్తతల నడుమ ఈ వివాదం మరింత ముదిరింది. అటు పరిశుభ్రత పేరిట బీజేపీ వివరణ ఇస్తున్నా, ఇటు సీజేపీ నేతలు మాత్రం ఈ 30 అడుగుల బొద్దింక దహనాన్ని తమపై చేసిన పరోక్ష రాజకీయ దాడిగా పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. విలేకరుల గదిలో ఈత కొలను?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement