మసాలా దోసెలో బొద్దింక | Cockroach Allegedly Found in Masala Dosa at Bengaluru’s Famous CTR! | Sakshi
Sakshi News home page

మసాలా దోసెలో బొద్దింక

Oct 29 2026 8:34 AM | Updated on Oct 29 2026 8:34 AM

Cockroach Allegedly Found in Masala Dosa at Bengaluru’s Famous CTR!

యశవంతపుర: బెంగళూరు నగరంలో బెస్ట్‌ హోటల్‌గా పేరుగాంచిన మల్లేశ్వరంలోని ఓ హోటల్‌లో మసాలా దోసెలో బొద్దింక వచ్చిందని ఓ కస్టమర్‌ ఆరోపించాడు. వివరాలు.. వెన్న దోసెకు పేరుగాంచిన ఈ హోటల్‌కు రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు. కస్టమర్‌ కూడా దోసె ఆర్డర్‌ ఇచ్చాడు. 

దోసె తింటుండగా చచ్చిన బొద్దింక అందులో ఉంది. సిబ్బందికి చెప్పగా, వారు పెద్దగా స్పందించలేదు. మరో దోసెను ఇస్తామని తాపీగా చెప్పారని కస్టమర్‌ తన వీడియోలో తెలిపాడు. బొద్దింక పడిన దోసెకు బదులు మరో దోసెను ఇస్తే సరిపోతుందా అని అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పేరున్న హోటళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement